రంగారెడ్డి జులై 13, (ఇయ్యాల తెలంగాణ ): రాజేంద్రనగర్ బండ్లగూడ లో 12 సంవత్సరాల విద్యార్థి మిస్సింగ్ కలకలం రేపింది. బుధవారం రాత్రి చిట్టి డబ్బులు ఇవ్వడానికి బయటకు వెళ్లిన సాయి చరణ్, ఎంతకీ ఇంటికి తిరిగి రాలేదు. దాంతో కుటుంబ సభ్యులు చుట్టుపక్కల వెతికారు. ఎక్కడా లభించకపోవడంతో రాజేంద్రనగర్ పోలీసులను తల్లి ఆశ్రయించింది. పోలీసులు రాత్రంతా తీవ్రంగా గాలించారు. సిసి టీవీ ఫూటేజ్ ను పరిశీలించారు.