హైదరాబాద్, నవంబర్ 15 (ఇయ్యాల తెలంగాణ) : విద్యాశాఖ మంత్రి కార్యాలయాన్ని ఏబీవీపీ కార్యకర్తలు మంగళవారం ముట్టడించారు. నిజాం కళాశాల హాస్టల్ సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బషీర్ బాగ్ లోని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కార్యాలయాన్ని ముట్టడిరచారు. కలశాల ప్రిన్సిపాల్ , ఉస్మానియా విసి విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారు. గత 10 రోజులుగా విద్యార్థులు ఆందోళన చేస్తున్న అధికారులు పట్టించుకోవడం లేదు. విద్యాశాఖ మంత్రి వెంటనే స్పందించి విద్యార్థుల న్యాయమైన డిమాండ్ ను పరిష్కరించాలని డిమాండ్ చేసారు.
ఏబీవీపీ నాయకుల అరెస్ట్
విద్యాశాఖ మంత్రి కార్యాలయ ముట్టడి ఉద్రిక్తతగా మారింది. కార్యాలయం లోనికి వెళ్లేందుకు ఏబీవీపీ నాయకులు ప్రయత్నించారు. వారిని పోలీసులు అడ్డుకున్నారు. ఈ నేపద్యంలో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ఆందోళన చేస్తున్న ఏబీవీపీ నాయకులను అరెస్ట్ చేపారు. ఘటనలో పలువురు విద్యార్థులకు గాయాలు అయ్యాయి.