వివేకా పైECకి పిర్యాదు చేస్తాం బండి సంజయ్‌

కుత్బుల్లాపూర్‌ అక్టోబర్ 26 (ఇయ్యాల తెలంగాణ ):కుత్బుల్లాపూర్‌, షాపూర్‌ లోని మాజీ ఎమ్మెల్యే  కూన శ్రీశైలం గౌడ్‌ ఇంటికి బిజెపి జాతీయ ప్రదాన కార్యదర్శి  చేరుకున్నారు. బుధవారం   ఓ చానెల్‌ టిబెట్‌ లో బీఆర్‌ ఎస్‌ ఎమ్మెల్యే  వివేకానంద, శ్రీశైలం గౌడ్‌ పై దాడిని అయన ఖండిరచారు. కూన శ్రీశైలంను  పరామర్శించి దాడి వివరాలను అడిగి తెలుసుకున్న బండి తరువాత విూడియాతో మాట్లాడారు.   అంబేత్కర్‌ రాజ్యాంగం కావాలా లేక కల్వకుంట్ల రాజ్యాంగం కావాలా.  శ్రీశైలంపై దాడిని ఎన్నికల కవిూషన్‌ దృష్టికి తీసికెల్తాం..ఆయనను అనర్హుడుగా ప్రకటించాలని కోరుతాం.  తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ సవిూకరణ వేగంగా మారుతున్నాయి.  విూడియా పార్టీలు వారిగా విడిపోయింది.  ప్రజలు మాత్రం బిజెపి పార్టీ పక్షాన ఉన్నారు.  పేరు వివేకానంద `  బుద్దులు మాత్రం  ఔరంగజేబ్‌.  సర్వేలన్ని  బిజెపి అనుకూలంగా ఉన్నాయి.  ప్రశ్నిస్తే దాడులా,  శ్రీశైలం పై దాడి ప్రజలపై దాడి. అక్రమంగా సంపాదించిన డబ్బులు వెదజల్లి గెలుస్తా అనే అహంకారంతో సంస్కారహీనంగా వివేక్‌ ప్రవర్తన ఉంది.  ఎలాంటి దాడులైన  పేదప్రజల కోసం బిజెపి  భరిస్తుంది.  ప్రజల సమస్యల కోసం ప్రశ్నించిన వారిపై దాడులు చేసే బీఆర్‌ఎస్‌  నాయకులు మనకు అవసరమా.  కండకావరంతో  దాడి చేసిన ఎమ్మెల్యే వివేకా గుండా అవసరమా.. కబ్జాలు చేసే వారిని బహిస్కరించాలిని అన్నారు.కుత్బుల్లాపూర్‌ ప్రజలు ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోవాలి.  నిన్న జరిగిన సంఘటనలో తప్పతాగి వచ్చి గొడవలు కారణమైన  వారిపై పోలీసులు చర్యలు తీసుకోవాలని డిమాండు చేసారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....