వివేక్‌ ను ఆహ్వానించిన రేవంత్‌ రెడ్డి

శంషాబాద్‌ నవంబర్ 1 (ఇయ్యాల తెలంగాణ ): కేసీఆర్‌ ను గద్దె దించాలంటే అంతా కలిసికట్టుగా పనిచేయాలని మాజీ ఎంఇ వివేక్‌ ను కోరడం జరిగిందని టీపీసీసీ ఛీఫ్‌ రేవంత్‌ రెడ్డి అన్నారు. శంషాబాద్‌ నోవా టెల్‌ దగ్గర అయన విూడియాతో మాట్లాడారు. గాంధీ కుటుంబంతో వివేక్‌ కు ఎంతో అనుబంధం ఉంది. వివేక్‌ తో రాహుల్‌ గాంధీ ఫోన్‌ లో మాట్లాడి కాంగ్రెస్‌ లో చేరాలని కోరారు. వివేక్‌ తిరిగి కాంగ్రెస్‌ లో చేరడమంటే ఆయన సొంత కుటుంబంలో చేరినట్లే. ఆయన్ను కాంగ్రెస్‌ లోకి సాదరంగా ఆహ్వానిస్తున్నానని అన్నారు. చేరిక కాంగ్రెస్‌ కు వెయ్యేనుగుల బలాన్ని చేకూర్చింది. కీలక సందర్భంలో ఆయన కాంగ్రెస్‌ లో చేరడంతో తెలంగాణ ప్రజలకు మేలు జరుగుతుంది. వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తుంది.. కాంగ్రెస్‌ కావాలి.. కాంగ్రెస్‌ రావాలి అనే ప్రజల ఆకాంక్షకు వివేక్‌ చేరిక బలాన్నిస్తుందని అన్నారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....