వివేక కేసులో విచారణ పూర్తి

 

హైదరాబాద్‌, జూన్‌ 30, (ఇయ్యాల తెలంగాణ ):జూలై 14కు వాయిదా

వైఎస్‌ వివేకా హత్య కేసులో ట్విస్టులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. వైఎస్‌ వివేకా హత్య కేసులో సీబీఐ విచారణకు సుప్రీంకోర్టు ఇచ్చిన గడువు ఈ రోజుతో ముగుస్తోంది. గతంలో అత్యున్నత న్యాయస్థానం జూన్‌ 30లోగా వివేకా కేసులో పూర్తి వివరాలు బయటపెట్టాలని సీబీఐని ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ రోజు సుప్రీంకోర్టులో కీలక విచారణ జరగబోతోంది. ఈ క్రమంలోనే.. మరోవైపు నాంపల్లి సీబీఐ కోర్టులో వివేకా హత్య కేసు విచారణ జరుగుతోంది. నిందితులను పోలీసులు సీబీఐ కోర్టులో హాజరుపర్చనున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో వివేకా హత్యకేసు విచారణలో ఏంజరగబోతోందన్న సస్పెన్స్‌ కొనసాగుతోంది. ఈ క్రమంలో సీబీఐ కోర్టు విచారణను మరోసారి వాయిదా వేసింది.వాస్తవానికి సీబీఐ కోర్టు విధించిన గడువు ఇవాళ్టితో ముగిసిన నేపథ్యంలో సీబీఐ అధికారులు సప్లిమెంటరీ చార్జ్‌షీట్‌ దాఖలు చేశారు. అయితే, చార్జ్‌షీట్‌లో కీలక వ్యక్తుల పేర్లను సీబీఐ అధికారులు ప్రస్తావించారు. దీంతో వైఎస్‌ వివేకా కేసు విచారణను జులై 14కు సీబీఐ కోర్టు వాయిదా వేసింది.ఇదిలాఉంటే.. వైఎస్‌ వివేకా కేసులో సుప్రీంకోర్టు విచారణకు ముందు.. ఈ కేసు దర్యాప్తును ముగించినట్లు సీబీఐ పేర్కొంది. దీనికి సంబంధించి పూర్తి నివేదికను సుప్రీంకు సమర్పించింది. అయితే.. సుప్రీంకోర్టు విధించిన గడవు మేరకు దర్యాప్తును ముగించామని అధికారులు తెలిపారు. దీనికి సంబంధించి పేర్లు జులై 3న సుప్రీం కోర్టులో జరిగే విచారణలో బయటకు రానున్నాయి.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....