విశిష్ట “గురుసేవా” పురస్కారం -2023

చార్మినార్,సెప్టెంబర్ 10 (ఇయ్యాల తెలంగాణ) : ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ( IRCS ) ఆధ్వర్యంలో పనిచేస్తున్న స్వచ్చంద మానవతా సంస్థ , దీనికి IRCS తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులుగా తెలంగాణ రాష్ట్ర గవర్నర్ గౌరనీయులు తమిళ సై  సౌందరరాజన్,  IRCS  హైదరాబాద్ జిల్లా అధ్యక్షులుగా జిల్లా కలెక్టర్ గౌరవనీయులైన శ్రీ అనుదీప్ దూరిశెట్టి గారు , మరియు హైదరాబాద్ జిల్లా చైర్మన్ గా  మామిడి భీమ్ రెడ్డి, 16 ఎంసీ సభ్యులచే  ఈ సంస్థ వ్యక్తుల ఆరోగ్యం , సంరక్షణ , రెస్క్యూ , రిలీఫ్, ఉపాధ్యాయ దినోత్సవం, డాక్టర్, నర్స్ సేవలను గుర్తించి వారికీ ఉత్తమ సేవా పురస్కారలు అందజేస్తోంది. 

 IRCS హైదరాబాద్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో తేదీ 09-09-2023 నాంపల్లి ఎగ్జిహిబిషన్ గ్రౌండ్ సరోజిని వనిత కాలేజీ ఆడిటరిలో నిర్వహించిన  ఉపాధ్యాయ దినోత్సవం వేడుకలు జరుపుకున్నారు.

* IRCS హైదరాబాద్ జిల్లా చైర్మన్ మామిడి భీమ్ రెడ్డీ , MC మెంబెర్స్ డాక్టర్ ఓ. శ్రీనివాస్ రెడ్డీ , వీరమణి , రిటైర్డ్ హై కోర్ట్ జడ్జి శ్రీ నేరెళ్ల మాల్యాద్రి చేతులమిదిగా కూలీ క్కుతుబషాహీ ప్రభుత్వ పాలిటెక్నిక్ సీనియర్ లెక్చరర్ గా పనిచేస్తున్న వి. శ్రీహరి భావితరాలకు భవిష్యత్ రూప కర్త గా ” విశిష్ట గురు సేవా పురస్కారం -2023 ”  అందుకున్నారు .

  వి. శ్రీహరి మెదక్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలో 6 సంవత్సరాలు  సీనియర్ లెక్చరర్ గా పని చేసారు , సూర్యాపేట ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీ లో 16 సంవత్సరాలు సీనియర్ లెక్చరర్ గా పనిచేసారు, మరియు ప్రస్తుతం హైదరాబాద్ జిల్లా బహదూర్పురా మండలంలో కూలి కూతుబషా ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలో 6 సంవత్సరాలుగా సీనియర్ లెక్చరర్ గా అంకితభావంతో మొత్తం 28 సంవత్సరం గా వేల సంఖ్యలో విద్యార్థులకు విద్యానందిస్తూ విద్యార్థులకు మార్గదర్శకంగా నిరంతరం కృషి చేస్తున్నారు.

 వి శ్రీహరి అనేక సామజిక సేవా కార్యక్రమలలో పాతబస్తి  ఉప్పగూడ ప్రాంతంలో 40 సవత్సరాలుగా అందిస్తున్నారు. లక్ష్మీ నరసింహ స్వామి గుడి చైర్మన్ గా గుడి యొక్క అభివృద్ధి పనులు చేపట్టి , లక్ష్మి నర్సింహా స్వామి దుప ధ్విప నైవేద్యం నీరంతరం అందిస్తున్నారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....