న్యూఢల్లీ సెప్టెంబర్ 30 (ఇయ్యాల తెలంగాణ ): బీఆర్‌ఎస్ ఎంఐఎం పార్టీలపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ మరోసారి నిప్పులు చెరిగారు. శనివారం విూడియాతో మాట్లాడుతూ…‘‘ విూరు ఏ దేశానికి భక్తులు? పాకిస్తాన్ కా?… ఆఫ్గనిస్తాన్ కా?. విూకసలు జనగణమన, వందేమాతరం ఆలపించడం తెలుసా?. ఇదే నా సవాల్…. విూరు దేశభక్తులైతే భాగ్యలక్ష్మీ వద్ద ఆలపించే దమ్ముందా?. దాడులకు యత్నించిన మజ్లిస్ నాయకులపై పోలీసులెందుకు చర్యలు తీసుకోవడం లేదు?. ఫిర్యాదు చేసిన బీజేపీ నేతలపైనే ఉల్టా కేసులు పెట్టి సమాజానికి ఏ సంకేతాలు పంపుతున్నారు?. మా సహనాన్ని పిరికితనంగా భావిస్తే ఖబడ్దార్… దారుస్సలాంపై జెండా ఎగరేసే సత్తా మాకుంది. తక్షణమే బీజేపీ కార్యకర్తలపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలి. ఎంఐఎం కార్యకర్తలపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందే. ఓల్డ్ సిటీ న్యూసిటీగా మారకపోవడానికి కారణం ఎంఐఎం, బీఆర్‌ఎస్ కాదా?. మిమ్మల్ని చూసి పాతబస్తీ మేధావులు ఛీదరించుకుంటున్నారు. ప్రశాంతమైన తెలంగాణను నాశనం చేయడమే పని. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ రాజకీయ అవకాశవాద పార్టీలు’’ అంటూ బండిసంజయ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
- Homepage
- Telangana News
- విూరు ఏ దేశానికి భక్తులు? పాకిస్తాన్ కా?…ఆఫ్గనిస్తాన్ కా?. విూకసలు జనగణమన, వందేమాతరం ఆలపించడం తెలుసా?.
విూరు ఏ దేశానికి భక్తులు? పాకిస్తాన్ కా?…ఆఫ్గనిస్తాన్ కా?. విూకసలు జనగణమన, వందేమాతరం ఆలపించడం తెలుసా?.
Leave a Comment