‘వేట్టయాన్‌’ షూటింగ్‌ పూర్తి చేసిన Super Star రజినీకాంత్‌

 ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై టి.జె. జ్ఞానవేల్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ‘వేట్టయాన్‌’ షూటింగ్‌ పూర్తి చేసిన సూపర్‌ స్టార్‌ రజినీకాంత్‌

సూపర్‌ స్టార్‌ రజినీకాంత్‌ టైటిల్‌ పాత్రలో జై భీమ్‌ ఫేమ్‌ టీ.జే. జ్ఞానవేల్‌ దర్శకత్వంలో ‘వేట్టయాన్‌’ అనే చిత్రం రూపొందుతోంది. ప్యాన్‌ ఇండియన్‌ రేంజ్‌లో ఎన్నో ప్రముఖ చిత్రాలను నిర్మిస్తున్న లైకా ప్రొడక్షన్స్‌ బ్యానర్‌ విూద సుభాస్కరన్‌ భారీ ఎత్తున ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో  అమితాబ్‌ బచ్చన్‌, ఫహద్‌ ఫాసిల్‌, రానా దగ్గుబాటి, మంజు వారియర్‌ వంటి భారీ తారాగణం నటిస్తోంది.

తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన అప్డేట్‌ వచ్చింది. రజినీకాంత్‌ ఈ మూవీ షూటింగ్‌ను పూర్తి చేసుకున్నారు. తన పాత్రకు సంబంధించిన షూట్‌ను పూర్తి చేయడంతో చిత్రయూనిట్‌ ఘనంగా వీడ్కోలు పలికింది. ఈ మేరకు నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్‌ సోషల్‌ విూడియాలో ట్వీట్‌ వేస్తూ ఈ విషయాన్ని ప్రకటించింది. యూనిట్‌ సభ్యులు అంతా కలిసి రజినీకాంత్‌కి గ్రాండ్‌గా వీడ్కోలు పలికారు.

ఇప్పటికే ఈ సినిమా విూద అంచనాలు భారీ స్థాయిలో నెలకొన్నాయన్న సంగతి తెలిసిందే.  వేట్టయాన్‌ మూవీని ఈ ఏడాది అక్టోబర్‌లో విడుదల చేయబోతోన్నట్టుగా ప్రకటించారు. ఈ చిత్రానికి అనిరుధ్‌ రవిచందర్‌ సంగీతాన్ని అందిస్తున్నారు. ఎస్‌.ఆర్‌. కతీర్‌ ఐ.ఎస్‌.సి సినిమాటోగ్రఫర్‌గా, ఫిలోమిన్‌ రాజ్‌ ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు.

తారాగాణం : రజనీకాంత్‌, అమితాబ్‌ బచ్చన్‌, ఫహద్‌ ఫాసిల్‌, రానా దగ్గుబాటి, మంజు వారియర్‌, కిషోర్‌, రితికా సింగ్‌, దుషార విజయన్‌,  జీఎం సుందర్‌, రోహిణి, అభిరామి, రావు రమేష్‌, రమేష్‌ తిలక్‌, రక్షణ, సాబుమోన్‌ అబుసమద్‌, సుప్రీత్‌ రెడ్డి తదితరులు

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....