హైదరాబాద్, జూలై 1, (ఇయ్యాల తెలంగాణ ): మరో రెండేళ్లలో శంషాబాద్ కు మెట్రో
హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్‌పై నిర్మించిన ఇంటర్ ఛేంజ్‌ను మంత్రులు కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డి ప్రారంభించారు. నార్సింగి వద్ద రూ.29.50 కోట్ల వ్యయంతో దీన్ని నిర్మించారు. ఔటర్ రింగ్‌రోడ్డుపై నిర్మించిన 20వ ఇంటర్ ఛేంజ్ ఇది. ఔటర్ రింగ్ రోడ్‌పై నిర్మించిన 20వ ఇంటరర్‌ఛేంజ్‌ను ప్రారంభించిన తర్వాత మాట్లాడిన మంత్రి కేటీఆర్… దేశంలో ఏ నగరానికి లేని ప్రత్యేకత హైదరాబాద్ సొంతమని అన్నారు. హైదరాబాద్‌లోని ఔటర్ రింగ్ రోడ్డుపై మరో ఇంటర్ చేంజ్ అందుబాటులోకి వచ్చింది. శనివారం ఉదయం నార్సింగి ఓఆర్‌ఆర్ ఇంటర్ చేంజ్‌ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. గ్రేటర్ చుట్టూ 158 కివిూ మేర ఉన్న ఔటర్ రింగ్ రోడ్డుపై ఇప్పటివరకు 19 ఇంటర్ చేంజ్‌లు ఉండగా.. కొత్తగా మరో మూడిరటిని ప్లాన్ చేశారు. నార్సింగి, కోకాపేట నియో పొలీస్, మల్లంపేట ప్రాంతాల్లో నిర్మిస్తున్నారు. ముందుగా నార్సింగి ఓఆర్‌ఆర్ ఇంటర్ చేంజ్‌కు సంబంధించిన పనులన్నీ పూర్తి కావడంతో ట్రాఫిక్‌ను అనుమతిస్తున్నారు.నార్సింగి ఇంటర్ చేంజ్ నిర్మాణం వల్ల నార్సింగి, మంచిరేవుల, గండిపేట ప్రాంతాల ప్రయాణికులు ఓఆర్‌ఆర్ విూదుగా వారి గమ్యస్థానానికి వెళ్లేందుకు వీలుగా ఉంటుంది.
అలాగే లంగర్ హౌస్, శంకర్ పల్లి నుంచి వచ్చే వారికి కూడా ఔటర్ రింగ్ రోడ్డు విూద వెళ్లేందుకు ఎంతో సులువుగా ఉంటుంది. నార్సింగి ఓఆర్‌ఆర్ ఇంటర్ చేంజ్‌ను ప్రారంభించిన అనంతరం మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ? ‘ఔటర్ రింగ్ రోడ్డుపై ఇది 20వ ఇంటర్ చేంజ్. డిసెంబర్ నెలలో మరొకటి అందుబాటులోకి వస్తుంది. సర్వీస్ రోడ్డులను విస్తరించాలని సీఎం చెప్పారు. ఔటర్‌పై రోడ్లు బావున్నాయి కాబట్టి 100 నుంచి 120కి స్పీడ్ పెంచాము. రాబోయే 2 ఏళ్లలో ఇక్కడి నుంచి ఎయిర్‌పోర్టుకు మెట్రో రైలు వస్తుంది’ అని అన్నారు.‘కరోనా వల్ల మూసి సుందరీకరణ చేయలేకపోయాము. మూసి విూద ఔటర్ లాగానే ఎక్స్ప్రెస్ వే కట్టాలని ఆలోచన చేస్తున్నాం. పది వేల కోట్లతో మూసి విూద 14 బ్రిడ్జిలు, స్కై వేలు నిర్మిస్తాం. మెట్రో రైల్‌ను విస్తరణ చేయాలని ప్లాన్ చేస్తున్నాం. బీహెచ్‌ఈఎల్ నుంచి మహేశ్వరం వరకు మెట్రో తీసుకురాబోతున్నాం. ఇండియాలో ఎక్కడలేని విదంగా మురికి నీరు శుద్ది చేయబోతున్నాం. మొదటి ప్లాంట్‌ను కోకపేటలో ప్రారంభిస్తున్నాం’ అని కేటీఆర్ తెలిపారు‘ఢల్లీికి వెళ్లి కేంద్రాకి కొన్ని విజ్ఞప్తులు చేసాం. మెహదీపట్నంలో స్కై వాక్ ఏర్పాటు చేయాలని మొదలు పెట్టాం. పక్కనే ఉన్న ఆర్మీ భూములు అవసరం ఉన్నాయి. ఆ భూములపై కేంద్ర మంత్రిని అడిగాం. కొత్త లింక్ రోడ్స్ కావాలన్నాం. ప్రధాన మంత్రి రాష్ట్రానికి రబోతున్నారని తెలిసింది. ఆ లోపే భూములు కేటాయించండని కోరాం. తొమ్మిది ఏళ్లుగా సతాయిస్తున్నారు.. అభివృద్ధి విషయంలో రాజకీయాలు చేయకండని విజ్ఞప్తి చేశాం. కోవిడ్ వల్ల కొన్ని పనులు ఆలస్యం అయ్యాయి. లక్ష కోట్ల నష్టం వచ్చింది. ఆగస్ట్ 15 వరకు ఔటర్ చుట్టూ సైకిల్ ట్రాక్ ప్రారంభిస్తాం’ అని మంత్రి కేటీఆర్ చెప్పుకొచ్చారు.అలాంటి నగరంలో మణిహారంలా ఓఆర్‌ఆర్ ఉందన్నారు. ఇప్పటికే నగరంలో ఫ్లైఓవర్‌లతోపాటు, అండర్‌పాస్‌లు నిర్మించామని తెలిపారు. వీటితోపాటు మూసీనదిపపై బ్రిడ్జిలు కూడా నిర్మించబోతున్నట్టు పేర్కొన్నారు. త్వరలోనే 14 వంతెనలకు శంకుస్థాపన చేయబోతున్నట్టు ప్రకటించారు.
మూసీనదిపై నిర్మించే వంతెనల్లో భాగంగా శంషాబాద్ నుంచి నాగోల్ వరకు 55 కిలోవిూటర్ల మేర ఎక్స్‌ప్రెస్‌వే నిర్మించబోతున్నట్టు తెలిపారు కేటీఆర్. దీనికి 15వేల కోట్లు ఖర్చు అవుతుందన్నారు. మరోవైపు మెట్రో విస్తరణ విషయంలో కూడా పనులు ఊపందుకోనున్నాయని తెలిపారు. రెండున్నరేళ్లలో శంషాబాద్ వరకు మెట్రో విస్తరణ పూర్తవుతుందన్నారు. బీహెచ్‌ఈఎల్ నుంచి కందుకూరు ఫార్మాసిటీ మెట్రో నిర్మాణానికి ప్రణాళికలు రూపొందిస్తామన్నారు. హైదరాబాద్‌లో 100 శాతం మురుగునీటి శుద్ధి జరుగుబోతోందన్నారు. కేటీఆర్. దీని కోసం దాదాపు నాలుగు వేల కోటల ఖర్చుతో 31 ఎస్టీపీ ప్లాంట్‌లు నిర్మించబోతున్నట్టు కూడా తెలిపారు. మొదటికి కోకాపేటలో ప్రారంభిస్తన్నట్టు తెలిపారు. సెప్టెంబర్ నాటికి అన్నింటినీ ప్రారంభించి దేశంలోనే మొదటి 100 శాతం మురుగునీటి శుద్ధ నగరంగా హైదరాబాద్ మారబోతుందన్నారు.