శ్రీగిరిలో సాంస్కృతిక కార్యక్రమాలు

శ్రీశైలం జులై 26, (ఇయ్యాల తెలంగాణ ):శ్రీశైల దేవస్థానము నిర్వహిస్తున్న ధర్మపథంలో భాగంగా నిత్యకళారాధన కార్యక్రమంలో భాగంగా శ్రీ మాధవి రామానుజం మరియు వారి బృందం, హైదరాబాద్‌, వారిచే సంప్రదాయ నృత్య ప్రదర్శన కార్యక్రమం ఏర్పాటు చేయబడిరది.ఆలయ దక్షిణ మాడవీధిలోని నిత్యకళారాధన వేదిక వద్ద ఈ రోజు సాయంకాలం 6 గంటల నుండి ఈ సంప్రదాయ నృత్య ప్రదర్శన కార్యక్రమం ఏర్పాటు చేయబడిరది.ఈ కార్యక్రమములో మహాగణపతిం, ఏకదంతాయ. శివతాండవం, అయిగిరినందిని భో శంభో, శంకరాభరణం, హరహరశంకర, బ్రహ్మమురారి, లింగాష్టకం, తదితర గీతాలకు జి.మన్విత రావు, అనుష, కె.అరుణ, కె.అనన్య, యమ్‌. అక్షయ భవాని, జె. నిత్య సాయి శ్రీ. డి. అద్విత, తదితరులు నృత్య ప్రదర్శనను చేయడం జరుగుతోంది.ఈ నిత్య కళారాధనలో ప్రతిరోజూ హరికథ, బుర్రకథ, సంప్రదాయ నృత్యం, వాయిద్య సంగీతం, భక్తిరంజని లాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయబడుతున్నాయి.శ్రీ స్వామిఅమ్మవార్లకు ఆయా కైంకర్యాలన్నీ పరిపూర్ణంగా జరగాలని మరియు ప్రాచీన కళ నిర్వహించబడుతున్నాయి

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....