శ్రీచైతన్య School లో విద్యార్ధి అనుమానస్పద మృతి !

మేడ్చల్‌, జూన్ 25 (ఇయ్యాల తెలంగాణ) : శ్రీ చైతన్య పాఠశాలలో విద్యార్థి అనుమానాస్పదంగా మృతి చెందిన సంఘటన పెట్‌ బషీరాబాద్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది.  కొంపల్లి శ్రీ చైతన్య పాఠశాలలో విద్యార్థి మల్లికార్జున13   చైతన్య పాఠశాల కె ఫోర్‌ క్యాంపస్లో  ఈ బాలుడు ఏడవ తరగతి చదువుతున్నాడు. మెదక్‌ జిల్లా చిల్వెర గ్రామానికి చెందిన మాదవి, బీరప్ప తల్లిదండ్రులు, వీరి కుమారుడు మల్లికార్జున ను స్కూల్‌ లో చేర్పించారు..సోమవారం రాత్రి అందరితో కలిసి భోజనం చేసి నిద్రపోయిన విద్యార్థి ఉదయం నిద్ర లేవలేదు. దీంతో సవిూపంలో ఉన్న ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. సమాచారం అందుకున్న పేట్‌ బషీరాబాద్‌ పోలీసులు బాలుడి మృతికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....