శ్రీమహాలక్ష్మీదేవిగా నేడు దుర్గమ్మ దర్శనం.

 ..

ఇంద్రకీలాద్రి, అక్టోబర్ 18 (ఇయ్యాల తెలంగాణ ):శరన్నవరాత్రుల్లో భాగంగా 4వ రోజైన బుధవారం ఆశ్వయుజ శుద్ధ చవితి నాడు ఇంద్రకీలాద్రిపై కొలువైన జగన్మాత కనకదుర్గమ్మ శ్రీమహాలక్ష్మీదేవిగా దర్శనమిస్తుంది. జగజ్జననీ అయిన శ్రీమహాలక్ష్మీ రూపంలో ఉన్న దుర్గామాత ఈ రోజున ఎరుపు రంగు దుస్తుల్లో భక్తులను సాక్షాత్కరిస్తుంది. యాదేవీ సర్వభూతేషు లక్ష్మీరూపేణ సంస్థితా.. అంటే సమస్త జీవుల్లోనూ ఉండే లక్ష్మీ స్వరూపం దుర్గాదేవి.. అని చండీ సప్తశతి చెబుతోంది. కాబట్టి శరన్నవరాత్రుల్లో లక్ష్మీదేవిని పూజిస్తే ఆ తల్లి సర్వమంగళ కారిణిగా ధన, ధాన్య, ధైర్య, విజయ, విద్య, సౌభాగ్య, సంతాన భాగ్యాలను ప్రసాదిస్తుంది. శ్రీమహాలక్ష్మీ దేవిగా దర్శనమిచ్చే కనకదుర్గమ్మకు నైవేద్యంగా పంచభోగాలైన తామర పేలాల పాయసం, చక్రపొంగలి, లడ్డు, పులిహోర, దద్యోజనాలను నివేదిస్తారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....