శ్రీవారిని దర్శించుకున్న Telangana- Deputy. CM మల్లు బట్టి విక్రమార్క

తిరుమల , డిసెంబర్ 12 (ఇయ్యాల తెలంగాణ) : తెలంగాణలో ఏర్పడిన ప్రజా ప్రభుత్వానికి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు మెండుగా ఉండాలని, రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని శ్రీవారిని ప్రార్థించినట్టు డిప్యూటీ సీఎం మల్లుబట్టి విక్రమార్క పేర్కొన్నారు. తిరుమల లో స్వామి వారిని దర్శనం కోసం కుటుంబ సభ్యులతో వెళ్లిన ఆయనకి టీటీడీ అధికారులు ఘన స్వాగతం పలికి, దర్శన ఏర్పాట్లు చేశారు. ఆలయంలో శ్రీవారిని దర్శించుకున్న అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులచే వేద ఆశీర్వచనంతో పాటు తీర్థ ప్రసాదాలను డిప్యూటీ సీఎం స్వీకరించారు. అనంతరం ఆలయం వేలుపల విూడియాతో మాట్లాడిన ఆయన తెలుగు వారందరూ సంతోషంగా ఉండాలని ఆ శ్రీవారి ఆశీస్సులు తెలుగు ప్రజల పైన ఎల్లవేళలా ఉండాలని కోరుకున్నట్లు పేర్కొన్నారు. కొత్తగా ఏర్పడిన ప్రభుత్వానికి స్వామి వారి ఆశీస్సులు ఉండాలని ప్రార్థించినట్లు తెలిపారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....