శ్రీశైలంలో ఘనంగా తొలి ఏకాదశి వేడుకలు

మల్లికార్జున స్వామి వారికి సహస్ర ఘాట్టాభిషేకం :

శ్రీశైలం, జూన్‌ 29 (ఇయ్యాల తెలంగాణ) : జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైల మహా క్షేత్రంలో తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని బుధవారం ఉదయం ఆలయ అధికారులు, అర్చకులు శ్రీ మల్లికార్జున స్వామి వారికి శాస్త్రోక్తంగా సహస్ర ఘట్టాభిషేకం నిర్వహించారు.  పాతాళ గంగ నుంచి నదీ జలాలను మంగళ వాయిద్యాల మధ్య తీసుకువచ్చిన ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ, దేవాదాయ శాఖ కమిషనర్‌ ఎస్‌.సత్యనారాయణ దంపతులు మరియు ఆలయ అధికారులు అర్చకులు.  రాష్ట్రంలో సకాలంలో వర్షాలు కురవాలని, పంటలు బాగా పండి రాష్ట్రం సస్యశ్యామలంగా ఉండాలన్న సంకల్పంతో సహస్ర ఘట్టాభిషేకం నిర్వహిస్తున్న దేవస్థానం అధికారులు.  వేదమంత్రోచ్చారనలతో మార్మోగుతున్న శ్రీశైలం. గురువారం  అంతా జలంలో ఉండనున్న మల్లికార్జున స్వామి. ఈ సందర్భంగా అన్ని ఆర్జిత సేవలు రద్దు చేసిన శ్రీశైలం దేవస్థానం ఈఓ లవన్న. శుక్రవారం తెల్లవారు జామున ఘట్టాభిషేకం జలాన్ని తొలగించి యధావిధిగా ఆలయ కైంకర్యాలు నిర్వహించబడుతాయని ఆలయ అధికారులు తెలియజేశారు. 

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....