శ్రీశైల మల్లన్న ఉభయ దేవాలయాల హుండీల లెక్కింపు

శ్రీశైలం అక్టోబర్ 12 (ఇయ్యాల తెలంగాణ ):అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటైన శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వాముల వారి ఉభయ దేవాలయాలలో హుండీల లెక్కింపు ద్వారా దేవస్థానానికి రూ.3,17,50,290/` నగదు రాబడిగా లభించింది. కాగా ఆలయ హుండీల ఆదాయాన్ని భక్తులు గత 28 రోజులలో 14 నుండి 11 వరకు సమర్పించడం జరిగింది. అలాగే ఈ హుండీలో 187 గ్రాముల 300 మిల్లీ గ్రాముల బంగారు, 6 కేజీల 340 గ్రాముల వెండి లభించాయి. అదేవిధంగా 243 యుఎస్‌ఎస్‌ఐ డాలర్లు. 450 ` ఆస్ట్రేలియా డాలర్లు, 40 కెనడా డాలర్లు. 15 ` యూఏఈ దిర్హమ్స్‌, 6` సింగపూర్‌ డాలర్లు, 5` యూరోస్‌ మొదలైన విదేశీ కరెన్సీ కూడా ఈ హుండీల లెక్కింపు లభించాయి. పటిష్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య సీసీ కెమెరాల నిఘాతో ఈ లెక్కింపును చేపట్టడం జరిగింది. ఈ హుండీల లెక్కింపులో కార్యనిర్వహణాధికారి  పెద్దిరాజు, అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది మరియు శివసేవకులు పాల్గొన్నారు

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....