శ్రీ పద్మావతి అమ్మవారి పసుపుకుంకుమ సారే ట్రైల్‌ రన్‌ విజయవంతం

తిరుపతి అక్టోబర్ 29 (ఇయ్యాల తెలంగాణ ): తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు నవంబర్‌ 10వ తేదీ నుండి మొదలుకానున్నాయి. బ్రహ్మోత్సవాలలో ముఖ్య ఘట్టమైన పంచమి తీర్థానికి చాలా ప్రాముఖ్యత ఉంది. పంచమి తీర్థానికి శ్రీవారి నుండి శ్రీ పద్మావతి అమ్మవారికి పసుపు కుంకుమ సారే ఊరేగింపుగా రావడం ఆనవాయితీగా వస్తోంది. ఈ నేపథ్యంలో శనివారం పసుపు కుంకుమసారే ఊరేగింపు ట్రయల్‌ రన్‌ ను నిర్వహించారు.ఈ ట్రైన్‌ రన్‌ లో భాగంగా తిరుమల శ్రీవారి ఆలయం నుంచి పసుపు, కుంకుమ, సారె గజాలపై ఊరేగింపుగా మొదలై ఆలయ నాలుగు మాడ వీధుల గుండా శ్రీ బేడి ఆంజనేయస్వామివారి ఆలయంకు చేరుకుంది. అక్కడినుండి తిరుపతిలోని అలిపిరి పాదాలమండపం వద్ద చేరుకొని అక్కడ నుండి కోమలమ్మ సత్రం (ఆర్‌ఎస్‌గార్డెన్‌), తిరుపతి పురవీధుల గుండా తిరుచానూరు పసుపు మండపానికి సారె చేరుకుంది. ఆ తరువాత అధికార గణంతో కలిసి ఊరేగింపుగా తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి  పుష్కరిణి వద్దకు సారెను తీసుకువెళ్ళారు.ఈ కార్యక్రమంలో విజిఓ నందకిషోర్‌ డిప్యూటీ ఈవో గోవిందరాజన్‌ ఏ ఈ ఓ రమేష్‌ ఏవీఎస్‌ ఓ శైలేంద్రబాబు విజిలెన్స్‌ ఇన్స్పెక్టర్‌ రామ్మోహన్‌ ఎస్సై వెంకటసుబ్బయ్య, విజిలెన్స్‌ బృందం టీటీడీ ముఖ్య అధికారులు తదితరులు పాల్గొన్నారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....