శ్రీ లక్ష్మణేశ్వర Temple మైదానంలో శ్రీ సీతారాముల కళ్యాణం కమనీయం !

హైదరాబాద్ ఏప్రిల్ 6 (ఇయ్యాల తెలంగాణ) :  చారిత్రాత్మకమైన శ్రీ లక్ష్మణేశ్వర ఆలయం మైదానంలో శ్రీ రామనవమి వేడుకలను పురస్కరించుకొని అంగ అంగరంగ వైభవంగా శ్రీ సీతారాముల కళ్యాణ వేడుకలను నిర్వహించారు. వేదమూర్తులైన బ్రాహ్మణోత్తముల వేద మంత్రాల మధ్య శ్రీరాముడు సీతామ తల్లి కళ్యాణ  వేడుకలు  కన్నుల పండుగగా అంగరంగ వైభవంగా జరిగాయి . మొదట శ్రీ లక్ష్మణేశ్వర ఆలయ పాలకమండలి భక్తుల కమిటీ ఆధ్వర్యంలో ఎదుర్కొళ్ళు కార్యక్రమం సంప్రదాయబద్ధంగా జరిగింది. అనంతరం సీతారామ చంద్రులను మేళ తాళాలతో ఊరేగింపుగా కళ్యాణ వేదికకు తీసుకొనివెళ్ళారు. రంగురంగుల పుష్పాలు తోరణాలతో శోభాయమానంగా తీర్చిదిద్దిన కల్యాణ వేదికపై స్వామివారి మూర్తులను ప్రతిష్టించి కళ్యాణం నిర్వహించారు. శ్రీ లక్ష్మణేశ్వర ఆలయం పాలకమండలి చైర్మన్ మా రెడ్డి దామోదర్ రెడ్డి నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో వేలాది మంది భక్తులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి సభ్యులు ఎం.ఎస్. ప్రభాకర్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పూర్వ సభ్యులు జీ. ఎస్.  సీతారామరాజు, సెట్విన్ మాజీ డైరెక్టర్ కె. ప్రవీణ్ కుమార్,  మజ్లిస్ పార్టీ సీనియర్ నాయకులు పులికంటి నరేష్,  కాంగ్రెస్ పార్టీ నాయకులు కే. వెంకటేష్,నరేష్,పి రాజు యాదవ్, టి.యు. డబ్ల్యు.జె. రాష్ట్ర కార్యదర్శి వరకాల యాదగిరి, తెలంగాణ పద్మశాలి సంఘం నాయకులు  రచ్చ నాగరాజు,  ఆర్యవైశ్య సంఘం ప్రతినిధులు  విశ్వేశ్వరయ్య గుప్తా,  గుగ్గిల అశోక్ కుమార్ గుప్తా,  తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.  శ్రీ వెంకటేశ్వర స్వామి విశేష భక్తులు ప్రముఖ సంఘ సేవకులు కొల్లోజు శ్రీదేవి శ్రీనివాసచారి దంపతులు స్వామి వారికి ముత్యాల తలంబ్రాలు పట్టు వస్త్రాలను సమర్పించారు. కళ్యాణ వేడుకల కార్యక్రమాలను ఆలయ కమిటీ ప్రతినిధులు పి రమేష్ కుమార్.. సత్యనారాయణ.. బాలా చారి.. రాజ్యలక్ష్మి లు పర్యవేక్షించారు .  కళ్యాణ వేడుకల సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన మహిళలు స్వామివారికి వడీ బియ్యం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు.   కళ్యాణ వేడుకలకు తరలివచ్చిన భక్తులందరికీ వడపప్పు పానకం అన్న ప్రసాదాన్ని అందజేశారు. సాయంత్రం పురవీధుల్లో మేళ తాళాలు మంగళ వాయిద్యాల మధ్య సీతారాముల ను ఊరేగించారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....