షిర్డి శ్రీ సాయిబాబా దేవాలయ హుండీ లెక్కింపు

కోరుట్ల జులై 13, (ఇయ్యాల తెలంగాణ ):పట్టణంలోని షిర్డి శ్రీ సాయిబాబా దేవాలయ హుండీ లెక్కింపు బుధవారం దేవాలయ మండపంలో జగిత్యాల జిల్లా దేవాదాయ పర్యవేక్షకులు పి. రవి కిషన్‌ పర్యవేక్షణలో హుండీలను విప్పి లెక్కించగా 6 లక్షల 86 వేల 280 రూపాయల నగదు వచ్చింది.. మిశ్రమ వెండి, మిశ్రమ బంగారం కంసాని లేనందున మళ్లీ హుండీలోనే వేసినట్లు సాయిబాబా  దేవాలయ కమిటీ అధ్యక్షులు చిదురాల భూమయ్య తెలిపారు.ఈ కార్యక్రమంలో జగిత్యాల జిల్లా దేవాదాయ పర్యవేక్షకులు పి. రవి కిషన్‌, దేవాలయ ఉపాధ్యక్షులు చిలివేరి విద్యాసాగర్‌, ప్రధాన కార్యదర్శి వోద్దినేని పురుషోత్తం రావు, సహాయ కార్యదర్శిలు పోతాని ప్రవీణ్‌ కుమార్‌ ,కోటగిరి నాగభూషణం, కోశాధికారి గజ్జెల్లీ లక్ష్మయ్య, ముఖ్య సలహాదారు బండారి రాజేశ్వర్‌ ,కార్యవర్గ సభ్యులు నీలి కాశీనాథం ,ఎలిమేల రామ్‌, నారాయణ, సదుల ఇంద్రాబాయి, కట్కూరి లింగయ్య ,సంకు అశోక్‌, ఆడేపు ఆనంద్‌, చిలువేరి మోహన్‌, కొత్త హన్మయ్య, ఎలేట్టి రాంరెడ్డి నల్ల శ్రీనివాస్‌, అర్చకులు పాల్గొన్నారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....