సంఘసంస్కర్త, మానవతావాది శ్రీ కొరివి కృష్ణస్వామి

హైదరాబాద్, డిసెంబర్ 19 (ఇయ్యాల తెలంగాణ) : సమాజంలో అణగారిన వర్గాల అభ్యున్నతికి, వారి విద్యాభివృద్ధికి కృషిచేసిన గొప్ప సంఘసంస్కర్త, మానవతావాది శ్రీ కొరివి కృష్ణస్వామి ముదిరాజ్ అని ఆల్ ఇండియా ముదిరాజ్ కోహ్లీ ఎగ్జిక్యూటివ్ మెంబర్ పొట్లకాయల వెంకటేశ్వర్ ముదిరాజ్ అన్నారు. దివంగత శ్రీ కొరివి కృష్ణస్వామి 55వ వర్ధంతిని పురస్కరించుకొని ఆయన సేవలను స్మరించుకుంటూ చూడి బజార్ లోని కొరివి కృష్ణ స్వామి ముదిరాజ్ విగ్రహానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో కొరివి కృష్ణ స్వామి ముదిరాజ్ జేఏసీ అడ్వైజర్ మరియు జెఎసి అధ్యక్షులు టి రవీందర్ ముదిరాజ్ సాయి కిరణ్ ముదిరాజ్ రాజేందర్ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు. 

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....