సనాతన ధర్మం…14 మందికి సుప్రీం నోటీసులు


న్యూఢల్లీ, సెప్టెంబర్‌ 22 (ఇయ్యాల తెలంగాణ ): సనాతన ధర్మంపై తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్‌ చేసిన వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఆయనతో పాటు మొత్తం 14 మందికి నోటీసులిచ్చింది. వీరిలో డీఎమ్‌కే ఎంపీ ఏ. రాజా కూడా ఉన్నారు. సనాతన ధర్మంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఉదయనిధి స్టాలిన్‌పై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలంటూ దాఖలైన పిటిషన్‌ని విచారించిన సుప్రీంకోర్టు ఆ మేరకు నోటీసులు అందించింది. తమిళనాడు పోలీసులు, అఃఎ,తమిళనాడు ప్రభుత్వానికి కూడా నోటీసులు అందాయి. వెంటనే దీనిపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది సుప్రీంకోర్టు. అయితే…ఈ వ్యాఖ్యల్ని విద్వేషపూరిత ప్రసంగంగా పరిగణించేందుకు సర్వోన్నత న్యాయస్థానం అంగీకరించలేదు.  ఈ నోటీసులపై ఆఓఐ నేత టీకేఎస్‌ ఎలంగోవన్‌ స్పందించారు. కొంత మంది ఈ వ్యాఖ్యల్లో క్లారిఫికేషన్‌ కావాలని పిటిషన్‌ వేశారని, తాము కూడా సనాతన ధర్మం అంటే ఏంటో వివరణ అడుగుతామని అన్నారు. కోర్టు ఆదేశాల మేరకు తాము స్పందిస్తామని వెల్లడిరచారు. సనాతన ధర్మంపై ఉదయనిధి స్టాలిన్‌ చేసిన వ్యాఖ్యలపై వివరణ కావాలని కొందరు సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేశారు. ప్రస్తుతం ఇది కోర్టులో ఉంది. మేం కూడా కేంద్ర ప్రభుత్వాన్ని సనాతన ధర్మం అంటే ఏంటో అడుగుతాం. ఈ సివిలైజ్డ్‌ సొసైటీలో ఇంకా ఆ ధర్మం అవసరమేంటో ప్రశ్నిస్తాం. వాళ్లు ఏదో వివరణ ఇస్తారు కదా. ఆ తరవాతే మేం కోర్టుకి సమాధానం చెబుతాని అన్నారు.

సనాతన ధర్మం వివాదంపై మద్రాస్‌ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. సనాతన ధర్మం తల్లిదండ్రుల్ని, గురువులను గౌరవించమని చెప్పిందని, పేదలను సంరక్షించాలని ఉపదేశించిందని వెల్లడిరచింది. సనాతనం అంటే కేవలం కుల వ్యవస్థ, అంటరానితనం అని మాత్రమే అభిప్రాపడడం సరికాదని తేల్చి చెప్పింది. ప్రస్తుతం జరుగుతున్న వివాదంపైనా అసహనం వ్యక్తం చేసింది. అంటరానితనం ఎక్కడ ఉన్నా దాన్ని కచ్చితంగా చెరిపేయాలని, అలాంటి వాటిని సహించకూడదని తేల్చి చెప్పింది. అది సనాతన ధర్మం పేరిట చేస్తే మరింత ఖండిరచాల్సిన అవసరముందని వ్యాఖ్యానించింది. భావ ప్రకటనా స్వేచ్ఛ ప్రాథమిక హక్కే అయినప్పటికీ…ఇది విద్వేషాలు పెంచేదిగా ఉండకూడదని స్పష్టం చేసింది. ముఖ్యంగా మతం గురించి మాట్లాడినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని సూచించింది. ఎవరి ప్రసంగం అయినా సరే…ఎవరి మనోభావాలనూ దెబ్బ తీసే విధంగా ఉండకూడదని చెప్పింది. 

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....