సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ వల్లే Telangana కు విముక్తి

  కాంగ్రెస్‌ స్వాతంత్య్ర పోరాటాన్ని కూడా వక్రీకరించింది : అమిత్‌ షా 

హైదరాబాద్‌ సెప్టెంబర్‌ 17 (ఇయ్యాల తెలంగాణ) : కేంద్రం ఆధ్వర్యంలో సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్రహోంమంత్రి అమిత్‌ షా హాజరయి.. జాతీయ జెండా ను ఆవిష్కరించారు. ఈ సందర్బంగా వార్‌ మెమోరియల్‌లో అమరవీరులకు నివాళులు అర్పించారు. అలాగే సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ విగ్రహానికి నివాళులర్పించారు. అనంతరం కేంద్ర బలగాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా సశస్త్ర సీమ బల్‌ను వర్చువల్‌గా అమిత్‌షా ప్రారంభించారు.ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సభలో అమిత్‌ షా మాట్లాడుతూ… తెలంగాణ ప్రజలకు విమోచన దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ విమోచనం కోసం పోరాడిన వీరులకు వందనమన్నారు. సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ వల్లే తెలంగాణకు విముక్తి లభించిందన్నారు. సర్దార్‌ పటేల్‌ లేకపోతే తెలంగాణకు విముక్తి లభించేది కాదని, సర్దార్‌ పటేల్‌, మున్షీ వల్లే నిజాం పాలన అంతమైందని అన్నారు. తెలంగాణ చరిత్రను కొందరు వక్రీకరించారని, నరేంద్రమోదీ ప్రధాని అయ్యాకే ఆ పొరపాటును సరిచేశారని అమిత్‌ షా అన్నారు. మోదీ పాలనలో దేశం అభివృద్ధిలో దూసుకెళ్తోందన్నారు. కాంగ్రెస్‌ స్వాతంత్య్ర పోరాటాన్ని కూడా వక్రీకరించిందని విమర్శించారు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని రాజకీయం చేస్తున్నారని, అలాంటి వారిని ప్రజలు క్షమించరని అమిత్‌ షా అన్నారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....