సికింద్రాబాద్‌ బిజెపి అభ్యర్థిగా మేకల సారంగపాణి

 
సికింద్రాబాద్‌  నవంబర్‌ 2 (ఇయ్యాల తెలంగాణ );సికింద్రాబాద్‌ శాసన సభ స్థానానికి బిజెపి అభ్యర్థిగా మేకల సారంగపాణి ని పార్టీ అధిష్టానం ప్రకటించింది.దీనితో నియోజకవర్గం లోని పార్టీ శ్రీనులు పెద్ద ఎత్తున సారంగపాణి నివాసానికి చేరుకొని అభినందనలు తెలిపారు.ఈ సందర్బంగా పార్టీ సీనియర్‌ నేత మాజీ ఎంఎల్సి ఎన్‌,రామచంద్రా రావు ఆయన నివాసానికి చేరుకొని శాలువా కప్పి అభినందనలు తెలిపి స్వీట్లు తినిపించారు.అనంతరం సారంగపాణి వారసిగూడ చౌరస్తాకు ర్యాలీగా బయలుదేరి చౌరస్తా లో కార్యకర్తలు పెద్ద ఎత్తున బాణ సంచ కాల్చి స్వీట్స్‌ పంచుకున్నారు.త్వరలో జరుగబోయే ఎన్నికల్లో సికింద్రాబాద్‌ స్థానాన్ని బిజెపి కైవసం చేసుకుంటుందన్న ధీమాను సారంగపాణి వ్యక్తం చేసారు.ఇప్పటికే బిఆర్‌ఎస్‌ అబ్యర్తి పద్మా రావు ప్రచారాని ప్రారంబించగా  అడుగడుగునా అతనికి చుక్కేడురవుతుంది.దీనితో సారంగపాణి ప్రజలు తనవెంటీ ఉన్నారని తన గెలుపు ఖాయమని అన్నారు.ఈ కార్యక్రమం లో పార్టీ సేనియర్‌ నేత కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....