సికింద్రాబాద్‌ Mettuguda వద్ద Train బోగీల్లో మంటలు

హైదరాబాద్‌, జూన్‌ 20, (ఇయ్యాల తెలంగాణ) : సికింద్రాబాద్‌ మెట్టుగూడ  వద్ద గురువారం ఉదయం రెండు రైలు బోగీల్లో మంటలు చెలరేగాయి. ఆలుగడ్డ బావి వద్ద ఆగి ఉన్న స్పేర్‌ కోచ్‌ల్లో ఒక్కసారిగా మంటలు రాగా చుట్టూ పొగలు అలుముకున్నాయి. దీంతో ఏం జరుగుతుందో అర్థం కాక స్థానికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. నిలిచి ఉన్న బోగీల నుంచి మంటలు వస్తున్నట్లు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు, రైల్వే సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలు అదుపు చేశారు. వాషింగ్‌కు వెళ్లి ప్లాట్‌ ఫాంపైకి వస్తున్న అదనపు ఏసీ బోగీల్లో షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా మంటలు వ్యాపించినట్లు గుర్తించారు. ప్రయాణికులు ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పిందని అధికారులు తెలిపారు. ఈ ఘటనపై దక్షిణ మధ్య రైల్వే జీఎం ఆరా తీశారు. అయితే, బోగీల్లో షార్ట్‌ సర్క్యూట్‌కు గల కారణాలేంటి అనే దానిపై విచారణ చేస్తున్నారు. బోగీలో మంటలు చెలరేగిన ముందు క్లీనింగ్‌ సిబ్బంది ఎవరు ఉన్నారనే దానిపై ఆరా తీస్తున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని ప్రయాణికులు కోరుతున్నారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....