సిరిసిల్ల కార్మికులకు ఫుల్‌ DEMAND

కరీంనగర్‌, ఆగస్టు 29, (ఇయ్యాల తెలంగాణ ); ఇప్పుడు తెలంగాణ లో ఎన్నికల వాతావరణం మొదలైయింది. అధికారం కోసం పార్టీ లు పోటీ పడుతున్నాయి..గెలుపు లో ప్రచారమే కీలక పాత్ర పోషిస్తుంది.. పార్టీ జెండాల తో ప్రచారం మరింత కలర్‌ ఫుల్‌ గా కనబడుతుంది. ఇప్పుడు సిరిసిల్ల లో రాజకీయ పార్టీ ల జెండాలు, బ్యానర్స్‌, టీ. షర్ట్స్‌. ఇతర ఎన్నికల సామాగ్రి తయారువుతుంది. తక్కువ ధరకు తయారు చేస్తు సరఫరా చేస్తున్నారు. ఎన్నికల వేళ కూడా రాష్ట్రంలోని వివిధ పార్టీల నాయకులందరి చూపు మళ్లీ సిరిసిల్లపైనే పడుతుంది. నిన్న మొన్నటి వరకు జాతీయ జెండాలు సిరిసిల్లలో తయారు చేసి సరఫరా చేసి జాతీయ స్థాయిలో మంచి పేరు సంపాదించుకున్న నేతన్నలు ఇప్పుడు కూడా రానున్న ఎన్నికల్లో సిరిసిల్ల కు చెందిన జెండాలే అంటూ చర్చ కొనసాగుతుంది.ఇక సిరిసిల్లలో ఎటు చూసిన వివిధ పార్టీల జెండాలు, బ్యానర్లు, టోపిలు తయారి చేస్తున్నారు. ఇక్కడ తయారవుతున్న ఎన్నికల ప్రచార సామాగ్రిపై, 4 వేల మందికి పైగా కార్మికులకు ఉపాధి పొందుతున్నారు. సిరిసిల్లలో తయారైన ఎన్నికల ప్రచార సామాగ్రిని వివిధ రాష్ట్రాలకు సరఫరా చేస్తు జీవనోపాధి పొందుతున్నారు. త్వరలో తెలంగాణ జరిగే ఎన్నికల కోసం పెద్ద ఎత్తున ఆర్డర్స్‌ వస్తున్నాయి. ఇతర రాష్ట్రల్లో ఎన్నికలు జరిగిన ఇక్కడి నుంచే ప్రచార సామాగ్రి ని పంపిస్తున్నారు.తమిళనాడు, కర్నాటక, కేరళ, ఢల్లీి, ఆంధ్రప్రదేశ్‌ వంటి రాష్ట్రాలకు ఇప్పటికే గత కొన్నేళ్లుగా ఈ ఎన్నికల ప్రచార సామాగ్రిని సరఫరా చేస్తున్నారు. డిజిటల్‌ మిషన్‌ ఆధారంగా పార్టీ జెండాలు తయారు చేస్తున్నారు. ఇప్పటికే బీఆర్‌ఎస్‌, బీజేపీ, కాంగ్రెస్‌ నుంచి పెద్ద ఎత్తున ఆర్డర్స్‌ వచ్చాయి.అన్ని పార్టీల నాయకులు, వివిధ నియోజకవర్గాల ఎమ్మేల్యే అభ్యర్థులు గతంలో కూడా సిరిసిల్లలోనే తమ ఎన్నికల ప్రచార సామాగ్రిని తయారు చేయించుకున్నారు. అడ్వాన్స్‌గా అర్డర్లు ఇస్తు.. తమకు కావాల్సిన ఫోటోలతో కలిగిన బ్యానర్లు, కండువాలు, టోపిలు ఇతర సామాగ్రిని తయారు చేయించుకుంటున్నారు. సిరిసిల్లలో 15 మంది పైగా ఆసాములు ఈ జెండాల తయారీలో నిమగ్నమయ్యారు. సమయం లేక కొంత మంది నాయకుల అర్డర్లు సైతం తిరస్కరిస్తున్న సంఘటనలు సిరిసిల్లలో చోటు చేసుకుంటున్నాయి. నాయకులకు నచ్చిన డిజైన్లలో, ఆయా పార్టీల రంగులతో ఇవి తయారు చేస్తున్నారు. ఒక్కో వ్యాపారి వద్ద 100 మందికి పైగా మహిళలు, పురుషులు పని చేస్తున్నారు. తక్కువ సమయంలో ఎక్కువ కూలీ డబ్బులు కార్మికులు సంపాదిస్తున్నారు. కార్మికులకు కొరత ఏర్పడిరది.దీంతో కూలీ రేటు తక్కువ సమాయానికి ఎక్కువ ఇస్తామనడంతో బీడీకార్మికులు బీడీలు చుట్టడం మానేసి ఈ ఎన్నికల ప్రచార సామాగ్రి తయారి కోసం వస్తున్నారు. ఆరు గంటల్లోనే రూ.300 నుంచి రూ.400 సంపాదిస్తున్నారు. కానీ ఈ సీజన్‌ కేవలం మూడు నెలలే ఉంటుందని బీడీ కార్మికులు పేర్కొంటున్నారు. బీడీలు చేస్తే రోజంత కష్టపడితే రూ.100 వస్తుందని, ఈ కండువాలు, బ్యానర్ల కట్టింగ్‌కు వస్తే నీడకు కూర్చోని రూ.300 పైగా సంపాదిస్తున్నమని మహిళలు పేర్కొంటున్నారు. బీడి కార్మికులకు, టైలర్లకు ఉపాధి కలుగుతుంది. ఈ రెండు నెల ల పాటు చేతి నిండ పని ఉంటుందని నేత కార్మికులు చెబుతున్నారు.. మహిళ ల కు ఎక్కువ ఉపాధి లభిస్తుందని అంటున్నారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....