సిద్దిపేట జులై 1 (ఇయ్యాల తెలంగాణ ):చిన్నకోడూరు మండల కేంద్రం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు సోమవారం సందర్శించారు.ఆసుపత్రిలో అందుతున్న సేవల గురించి ఆరా తీశారు. ఓపీ, ఏఎన్సీ చెకప్స్, ఫార్మసీలో అందుబాటులో ఉన్న మందులు, డయాగ్నోస్టిక్ సేవలు అందిస్తున్న తీరును పరిశీలించారు. వానాకాలం ప్రారంభమైన నేపథ్యంలో డెంగ్యూ, మలేరియా వంటి విషజ్వరాలు ప్రభలే అవకాశం ఉంటుంది కాబట్టి, అవసరమైన మందులు, ల్యాబ్ పరికరాలు, రసాయనాలు ఉండేలా చూడాలన్నారు. డెంగ్యూ, మలేరియా కేసులు ఎన్ని వస్తున్నాయి, ఎలాంటి చికిత్స అందిస్తున్నారనే విషయాలను డాక్టర్ ను అడిగి తెలుసుకున్నారు. హరీశ్ రావు.ఉచిత పరీక్షలు నిర్వహించే డయాగ్నోస్టిక్ సెంటర్ల సేవలు పేషెంట్లకు అందించాలని, వీలైనంత తర్వగా రిపోర్టులు తెప్పించి తగు వైద్యం అందించాలన్నారు.
- Homepage
- Telangana News
- సీజనల్ వ్యాధుల ఫై అప్రమత్తంగా ఉండాలి..
సీజనల్ వ్యాధుల ఫై అప్రమత్తంగా ఉండాలి..
Leave a Comment