సీబీఐ కేసులు..జగన్‌ వే

హైదరాబాద్‌, జూన్‌ 30, (ఇయ్యాల తెలంగాణ ):ఆంధ్రప్రదేశ్‌ సీఎం జగన్మోహన్‌ రెడ్డిపై ఉన్న సీబీఐ కేసుల విచారణ సీబీఐ కోర్టులో శుక్రవారం జరిగింది. శుక్రవారం కోర్టులో విచారణ జరగనున్న కేసుల జాబితాను నోటీస్‌ బోర్డులో అంటించారు. ఇందులో మొదటి నుంచి చివరి వరకూ ఉన్నవి ఏపీ సీఎం జగన్మోహన్‌ రెడ్డి ఏ వన్‌ గా ఉన్న కేసులే. అక్రమాస్తుల కేసులకు సంబంధించి దాఖలు చేసిన వివిధ రకాల పిటిషన్లపై విచారణ ఉన్నట్లుగా నోటీసు బోర్డులో అంటించిన వివరాల ద్వారా వెల్లడయింది. కాసేపటికే ఈ ఫోటోలు వైరల్‌ అయ్యాయి. సీబీఐ కోర్టులో రోజంతా జగన్‌ గురించే విచారణ జరిగిందని సోషల్‌ విూడియాలో ఇతర పార్టీల నేతలు సెటైర్లువేయడం ప్రారంభించారు. ఈ జాబితాలను సోషల్‌ విూడియాలో పోస్ట్‌ చేసిన తెలుగుదేశం పార్టీ  20 క్రిమినల్‌ కేసుల్లో ఏ`1 జగన్‌ రెడ్డే. ఇటువంటి క్రిమినల్‌ చేత పాలింపబడుతున్న రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ గర్వపడాలేమో! ఏది ఏమైనా…  దేశంలో ఏ ముఖ్యమంత్రికైనా…  ఈ క్రిమినల్‌ రికార్డు అధిగమించాలంటే ఇప్పట్లో సాధ్యం కాదని విమర్శించారు. వైఎస్‌ సీఎంగా ఉన్నప్పుడు జగన్‌ అవినీతి చేసి అక్రమాస్తులు పోగేశారని సీబీఐ కేసులు   తన తండ్రి సీఎంగా ఉన్న వైఎస్‌ జగన్‌ పెద్ద ఎత్తున క్విడ్‌ ప్రో కోకు పాల్పడి అక్రమార్జన చేశారని.. సీబీఐ కేసులు నమోదు చేసింది. సీబీఐ దాఖలు చేసిన మొత్తం 11 ఛార్జిషీట్లలో వైఎస్‌ఆర్‌సి అధ్యక్షుడు ఏ 1గా ఉన్నారు. మొత్తం 11 ఛార్జిషీట్‌లలో  జగన్‌  తన వ్యక్తిగత హోదాలో నిందితుడిగా ,  నిందితులుగా ఉన్న  కంపెనీల ప్రతినిధిగా ఉన్నారు.  ఈ కేసులో చివరి ఛార్జిషీటు దాఖలు చేసి పదేళ్లవుతున్నా విచారణ ప్రారంభం కాలేదు . దీనికి కారణం అక్రమాస్తుల కేసుల్లోని నిందితులు ఒకరి తర్వాత ఒకరు డిశ్చార్జ్‌ పిటిషన్లు..ఇతర పిటిషన్లు వేసి.. న్యాయవ్యవస్థలో ఉన్న లొసుగులను  ఉపయోగించుకుని విచారణ ఆలస్యం చేస్తున్నరని సీబీఐ పలుమార్లు కోర్టుకు తెలిపింది.  విచారణ సమయంలో వ్యక్తిగత విచారణకు మినహాయింపు ఇవ్వడానికి కోర్టు నిరాకరించింది. ప్రతిపక్ష నేతగా ప్రతి శుక్రవారం కోర్టుకు హాజరవుతూనే పాదయాత్ర చేశారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన విచారణకు హాజరు కాలేదు. హైకోర్టు ఆయనకు విచారణకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇచ్చింది. అయితే కోర్టులో కేసుల విచారణ సాగుతూనే ఉంది. అక్రమాస్తుల కేసులో నిందితులు వేసిన పిటిషన్లపై కోర్టు విచారణ జరుపుతోంది.ఇంకా అసలు కేసుల ట్రయల్స్‌ ప్రారంభం కాలేదు. 

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....