సుప్రీం కోర్టులో చంద్రబాబు ఫైబర్‌ నెట్‌ కేసు విచారణ నవంబర్‌ కి వాయిదా వేసిన ధర్మాసనం

న్యూఢల్లీ అక్టోబర్ 20 (ఇయ్యాల తెలంగాణ ):తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ పై విచారణ వాయిదా పడిరది. సుప్రీంకోర్టులో తదుపరి విచారణ నవంబర్‌ 8 వ తేదీకి  వాయిదా పడిరది.  చంద్రబాబుతరఫున లాయర్‌ సిద్ధార్థ లూథ్రా వాదనాలు వినిపించారు.. సిద్ధార్థ్‌ లూథ్రా వాదనలు వినిపిస్తూ.. ఇప్పటికే మూడు ఎఫ్‌ఐఆర్‌ లు నమోదు చేయగా ఒక దానిపై తీర్పును కోర్టు రిజర్వ్‌ చేసిందని అత్యున్నతన్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు. ఈ క్రమంలో విచారణను వాయిదా వేయాలని కోర్టును అభ్యర్థించారు. దీనిపై ప్రభుత్వ లాయర్‌ స్పందిస్తూ.. కస్టడీలో ఉన్న వ్యక్తికి సంబంధించి అరెస్టు అనే ప్రశ్నఉత్పన్నం కాదని చెప్పారు. ఆ కేసులోనూ జ్యుడీషియల్‌ కస్టడీ కొనసాగుతుందని కోర్టుకు తెలిపారు. దీంతో విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసింది.పైబర్‌ నెట్‌ కేసులో మిగతా అందరికీ బెయిల్‌ మంజూరు చేసిన ఏపీ హైకోర్టు.. చంద్రబాబు పిటిషన్‌ ను మాత్రం తోసిపుచ్చిన విషయం తెలిసిందే.  దీంతో చంద్రబాబు తరఫు లాయర్లు సుప్రీం కోర్టులో పిటిషన్దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ ను శుక్రవారం విచారణకు వచ్చింది. . జస్టిన్‌ అనిరుద్ధ బోస్‌, జస్టిస్‌ బేలా ఏం.త్రివేదిలతో కూడిన ధర్మాసనం ముందు చంద్రబాబు లాయర్‌ సిద్ధార్థ్‌ లూథ్రా వాదనలువినిపించారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....