సెలబ్రిటీ క్రికెట్‌ లీగ్‌ 2024 PROMO బుర్జ్‌ ఖలీఫాలో Grand గా Launch

సెలబ్రిటీ క్రికెట్‌ లీగ్‌ 10వ సీజన్‌ను దుబాయ్‌లో (2 ఫిబ్రవరి 2024) అద్భుతమైన షో తో కిక్‌ స్టార్‌ చేశారు. గ్లోబల్‌ మెట్రోపాలిస్‌, వండర్‌ ఫుల్‌ బుర్జ్‌ ఖలీఫాపై ఈ సీజన్‌ ప్రోమోను లాంచ్‌ చేశారు. అఅఒ మొత్తం 8 జట్ల నుండి సూపర్‌ స్టార్లు, కెప్టెన్లు కిచ్చా సుదీప్‌ (కన్నడ), సోహైల్‌ ఖాన్‌ (హిందీ), ఆర్య, జీవా (తమిళం), థమన్‌ డ సుధీర్‌ బాబు (తెలుగు), జిస్సు సేన్‌గుప్తా (బెంగాల్‌), బన్ను ధిల్లాన్‌, సోనూ సూద్‌ (పంజాబీ), ఇంద్రజిత్‌ సుకుమారన్‌, ఉన్ని ముకుందన్‌ (మలయాళం)  దుబాయ్‌లో ప్రత్యక్షంగా వీక్షించారు.

సెలబ్రిటీ క్రికెట్‌ లీగ్‌ అనేది సినిమా, క్రికెట్‌ను కలిపే స్పోర్టైనైమెంట్‌. భారతదేశంలో 8 విభిన్న భాషల నుండి 200G మంది నటీనటులను ఒకచోట చేర్చే ఏకైక స్పోర్ట్స్‌ లీగ్‌. ఇది క్రీడలు, వినోదాల కలయిక. గ్రాండియస్‌ లీగ్‌ ఫిబ్రవరి 23న షార్జాలో ప్రారంభమవుతుంది. భారతదేశంలో మరో మూడు వీకెండ్స్‌ లో 20 యాక్షన్‌`ప్యాక్డ్‌, అద్భుతమైన మ్యాచ్‌లతో క్రికెట్‌ అభిమానులను, ప్రేక్షకులను అలరిస్తుంది. ఆడ్రినలిన్‌`పంపింగ్‌ టోర్నమెంట్‌ సోనీ స్పోర్ట్స్‌ టెన్‌ 5,  జియో సినిమా, పలు ప్రాంతీయ ఛానెల్‌లో ప్రత్యక్ష ప్రసారం కానుంది.

సెలబ్రిటీ క్రికెట్‌ లీగ్‌ వ్యవస్థాపకుడు డ మేనేజింగ్‌ డైరెక్టర్‌ విష్ణు వర్ధన్‌ ఇందూరి మాట్లాడుతూ, ‘‘అఅఒ మొదటి నుంచి అద్భుతంగా అలరిస్తుంది. ప్రతి సంవత్సరం లీగ్‌ వృద్ధి చెందడం లీగ్‌ లో క్రికెట్‌ ఆడే ప్లేయర్స్‌ ప్యాషన్‌ కి ప్రతిబింబం. అఅఒ 2024 గతంలో కంటే బిగ్గర్‌ గా ఉండబోతుంది’’ అన్నారు

బుర్జ్‌ ఖలీఫా ప్రోమో లాంచ్‌ గురించి కిచ్చా సుదీప్‌ మాట్లాడుతూ, ‘‘నేను ఇంతకుముందు నా సినిమాల కోసం బుర్జ్‌ ఖలీఫా వచ్చాను. క్రికెటర్‌గా బుర్జ్‌ ఖలీఫాలో వుండటం చాలా ప్రత్యేకమైనది, మరచిపోలేనిది’’అన్నారు.

సోనూ సూద్‌  మాట్లాడుతూ ‘‘మన గొప్ప దేశంలోని 8 పవర్‌ ఫుల్‌ ఫిల్మ్‌ ఇండస్ట్రీలు ప్రాతినిధ్యం వహిస్తున్న సూపర్‌స్టార్‌లతో కలిసి ఉండటం, ప్రపంచంలోని ఎత్తైన ఐకానిక్‌ నిర్మాణం ముందు నిలబడి మొత్తం భారతదేశం ఉద్వేగభరితంగా ఇష్టపడే లీగ్‌  ప్రారంభోత్సవాన్ని వీక్షించడం ఒక అద్భుతమైన అనుభవం. ఈ సంవత్సరం అఅఒ  అద్భుతమైన ఎడిషన్‌గా అలరిస్తుంది’’ అన్నారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....