సెల్ ఫోన్ డ్రైవింగ్ ప్రమాదమా ? ఫ్యాషనా ? Cell Phone driving is Danger – are it is Fashion ?

హైదరాబాద్ నగరంలో సెల్ ఫోన్ డ్రైవింగ్ ల లొల్లి బాగా పెరిగిపోయింది. సెల్ ఫోన్ చెవిలో పెట్ట్టుకొని మెడలు వంచి ఫోన్ మాట్లాడడం పెద్ద ఫ్యాషన్ గా మారి పోయింది. ఏ గల్లీలో చూసిన ఫోన్ లో మాట్లాడే వారి సంఖ్య ఎక్కువగా పెరిగి పోతుంది. యూత్ కి  తోడు కొందరు పెద్ద మనుష్యులు, ముసలోళ్ళు కూడా చెవి కాడ ఫోన్ పెట్టి మాట్లాడడం పెద్ద ఫాషన్ గా అనుకుంటున్నారు. సెల్ ఫోన్ మాట్లాడడం డేంజర్ కదా ఎందుకు మాట్లాడుతున్నారు అని ఎవరినైనా అడిగితే ఎవరన్నారు ? ఇది పెద్ద ఫ్యాషన్ అనే ధోరణి కనిపిస్తోంది. అసలు దీనికి కారణం ఏమై ఉంటుంది ? డ్రైవింగ్ చేస్తూ సెల్ ఫోన్ మాట్లాడుతూ వెళ్లడాన్ని సామాన్య విషయంగా ఎందుకు వదిలేశారు? అసలు కొందరు సెల్ ఫోన్ డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఎందుకు సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేస్తున్నారని అడిగినా?  నీ కెందుకు నీ పని నువ్వు చూసుకో ? లేదా ఆలా అడిగిన వారితో గొడవకు దిగడం లాంటివి కూడా చేస్తున్నారు. అసలు సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడమే పెద్ద తప్పు కానీ ఎందుకు చేస్తున్నావంటే ..? అలాంటి వారిని నీకెందుకు అని కొందరు యువత అడిగిన వారిని కూడా చితక బాదిన సందర్భాలు అనేకం ఉన్నాయి. అసలు సెల్ ఫోన్ డ్రైవింగ్ ఎందుకు అనే ప్రశ్న ఎందుకు తలెత్తడం లేదు? అసలు సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేసేవారు కూడా ఏమంత ఇంపార్టెంట్ కాల్ అటెండ్ చేస్తున్నారా ? అంటే అదీ లేదు. మేము చేసిన కొన్ని పరిశోధనల్లో ఎక్కువ శాతం డ్రైవింగ్ చేస్తూ సెల్ ఫోన్ మాట్లాడే వారు పనికి రాని టైం పాస్ ఫోన్ కాల్స్ ఎక్కువగా అటెండ్ చేస్తున్నారనే విషయాన్నీ గమనించి ఇదేమి విడ్డూరం అనే ప్రశ్న తలెత్తింది. కాదని కూడా మా పరిశోధనలో తేలింది. డ్రైవింగ్ చేస్తూ సెల్ ఫోన్ మాట్లాడ గలననే ధీమాతోనే ఎక్కువ మంది  ఫోన్లో మాట్లాడడం జరుగుతుందే  తప్ప అత్యవసరమైన కాల్ వచ్చి మాట్లాడాననే వారి సంఖ్య అత్యంత తక్కువగా సింగల్ డిజిట్ నంబర్ తోనే ఉండడం విడ్డూరం. 

పక్క వారికే ఎక్కువ ఇబ్బందులు :

సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేస్తున్న సందర్భంలో అలా ఫోన్లో మాట్లాడుతూ డ్రైవింగ్ చేసే వారి కన్నా పక్కనుంచి వెనుక నుంచి వెళుతున్న ప్రయాణీకులకే ఎక్కువగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సరైన దిశలో వారు ప్రయాణం చేయలేక అనేక రకాల ఇబ్బందులను ఎదుర్కొన్న సందర్భాలు కోకొల్లలుగా ఉన్నాయి. సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేసే వారిని చూస్తూ వారిని తప్పించుకోబోయి ప్రయత్నంలో అనేక పర్యాయాలు వేరే ప్రయాణికులు ప్రమాదాల బారిన పడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. 

పెద్ద మనుష్యుల వల్ల ఎక్కువ డేంజర్ తస్మాత్ జాగ్రత్త ?

నాలుగు చక్రాల వాహనము నడిపే వారు కార్లలో తమ దృష్టినంతా ఎక్కువగా సెల్ ఫోన్ పైనే కేంద్రీకరించడంతో ముందు నుంచి ఎవడు వెళుతున్నా వాడు మటాషే? ఇలాంటి సంఘటనలు నిత్యం కోకొల్లలు జరిగినా ఎవరు కిమ్ అనకుండా ఉండిపోతున్నారు. ఇక పోలీసులైతే తమకు ఏమీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. కార్లలో వెళుతున్న పెద్ద మనుష్యులు బడా బాబులు కావడంతో వారిని ఏమనలేక అమాయక మైన జీవితాలు ఎన్నో ఫోన్లో మాట్లాడుతూ డ్రైవింగ్ చేసే వారి వల్ల గాలిలో కలిసి పోవడమో? అలాంటి వారి వల్ల జీవితాంతం ఇబ్బందులకు గురికావడమో జరుగుతుంది. ప్రమాదంలో చిన్న చిన్న గాయాలైన వారు ఎలాగోలా తమ జీవితాలను ముందుకు నెట్టుకుంటూ వస్తున్నారు. ప్రమాదంలో చిన్నగా గాయ పడిన దాని ప్రభావం జీవితాంతం ఎక్కడో అక్కడ నొప్పిగా ఉండడం జరుగుతుది. అలాంటి ఏంతో మంది జీవితాలు సెల్ ఫోన్ డ్రైవింగ్ చేస్తూ వాహనాలు నడిపిన వారి వల్ల ఇబ్బందులు పడ్డామని తెలిసినా ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోతున్నారు. సెల్ ఫోన్ డ్రైవింగ్ అనేది కొందరికి చిన్న సమస్య లాగే కనిపించినా ? దాని వల్ల ఎన్నో కుటుంబాలు ఇబ్బందుల బారిన పడ్డారు. ప్రభుత్వాలు పట్టించుకోక పోయినా పోలీసులు ఏమనడం లేదని వదిలేసినా ? సమాజానికి మనమంతా కీడు చేసిన వారమే అవుతాము అందుకే ప్రతి ఒక్కరు ఆలోచించి సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయకుండా ఉండేలా చూద్దాం.  కొంత మేరకైనా ప్రమాదాల నివారణకు అడ్డుకట్ట వేద్దాం. 

🙏NO CELL PHONE DRIVING PLEASE 🙏

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....