సోనియాగాంధీ బలిదేవత BRS MLA కల్వకుంట్ల కవిత నిప్పులు

మెట్‌పల్లి అక్టోబర్‌ 21  (ఇయ్యాల తెలంగాణ ); ప్రత్యేక రాష్ట్రం కోసం సీఎం కేసీఆర్‌ 2009లో దీక్ష చేస్తే ఇచ్చినటువంటి తెలంగాణను వెనక్కి తీసుకొని వందలాది బిడ్డల ప్రాణాలను తీసుకున్న ఇటలీ రాణి సోనియాగాంధీ బలిదేవత అని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నిప్పులు చెరిగారు. జీవన్‌ రెడ్డి కొంచెం సోయి తెచ్చుకొని మాట్లాడాలని కవిత సూచించారు. నన్ను క్వీన్‌ ఎలిజబెత్‌ రాణి అని పిలుచుడు కాదు.. నేను విూ ఇటలీ రాణిని కాదు. విూ ఇటలీ రాని లెక్క నేను వందలాది తెలంగాణ బిడ్డల ప్రాణాలను నేను బలి తీసుకోలేదు. విూరు దిగజారిపోయి హోదాను మరిచిపోయి తెలంగాణకు ప్రతీక అయినటువంటి బతుకమ్మను అవమానించినా కూడా నేను సంయమనంతో మాట్లాడుతున్నాను అని కవిత వ్యాఖ్యానించారు. జగిత్యాల ప్రజలు జీవన్‌ రెడ్డిని తప్పకుండా తిరస్కరిస్తారని స్పష్టం చేశారు. రాహుల్‌ గాంధీ బబ్బర్‌ షేర్‌ కాదు? ఆయన పేపర్‌ టైగర్‌ అని కవిత మండిపడ్డారు.మెట్‌పల్లిలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో కవిత మాట్లాడుతూ.. నెహ్రూ కాలం నుంచి వాళ్ల కుటుంబానికి తెలంగాణతో అనుబంధం ఉందని రాహుల్‌ గాంధీ చెబుతున్నారని, తెలంగాణతో రాహుల్‌ గాంధీ కుటుంబానికి నమ్మకద్రోహపు అనుబంధం ఉన్నదని మండిపడ్డారు. 1969లో ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన 369 మందిని తుపాకులతో కాల్చి చంపించిన చరిత్ర కాంగ్రెస్‌ది అని కవిత ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ బిడ్డ ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి గా ఉన్న అంజయ్యను రాహుల్‌ గాంధీ తండ్రి రాజీవ్‌ గాంధీ అవమానించారని చెప్పారు. సీఎం కేసీఆర్‌ చావు నోట్లో తల పెడితే 2009లో తెలంగాణ ఏర్పాటును ప్రకటించి మళ్లీ వెనక్కి తీసుకుంటే వందలాదిమంది బిడ్డల చావులకు సోనియాగాంధీ కారణమయ్యారని అన్నారు. ప్రజా పోరాటాలతోనే 2014లో తెలంగాణ వచ్చిందని స్పష్టం చేశారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....