హైదరాబాద్, ఏప్రిల్ 1 (ఇయ్యాల తెలంగాణ) : తెలంగాణ రాష్ట్ర ఇన్నోవేషన్ సెల్ , యునిసెఫ్ , ఇన్కిలాబ్ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా పాఠశాల విద్యార్థులకు ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన స్కూల్ ఇన్నోవేషన్ ఛాలెంజ్ –2021 రాష్ట్రస్థాయి పోటీలకు జిల్లానుండి ( 1 ప్రాజెక్టు) పీ ఓబుల్ రెడ్డి పబ్లిక్ స్కూల్ విద్యార్థులు ఎంపికైనట్టు జిల్లా విద్యాశాఖాధికారిణి ఆర్ .రోహిణి తెలిపారు .
* రాష్ట్ర స్థాయి తుది ప్రదర్శనకు పీ ఓబుల్రెడ్డి పబ్లిక్ స్కూల్ పాఠశాల విద్యార్థులు ఎంపిక కావడం పట్ల జిల్లా సైన్స్ అధికారి ధర్మేందర్ రావు , ప్రధానోపాధ్యాయులకు ప్రోత్సహించిన గైడ్ టీచర్లకు జిల్లా విద్యాశాఖాధికారిణి ఆర్ రోహిణీ అభినందించారు ,.
* ఏప్రిల్ 3 ,4 తేదీల్లో హైదరాబాద్లో నిర్వహించే గ్రాండ్ ఫినాలేకు హాజరుకావాలని TSIC నుండి విద్యార్థులకు ఆహ్వానం అందినట్టు డీఈఓ పేర్కొన్నారు .
* రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాల నుండి 5387 ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులు 11037 వినూత్న సమాజ్ సమాజ హిత ఆవిష్కరణల వివరాలను నమోదు చేయగా అందులో 79 ఉత్తమ ఆలోచనల్లో తొలిదశలో జిల్లాస్థాయికి వైజ్ఞానిక ప్రదర్శనలు ఎంపికయ్యాయి.
* రాష్ట్ర స్థాయి తుది ప్రదర్శనలకు పి .ఓబుల్ రెడ్డి పాఠశాల విద్యార్థులు చూపిన ప్రతిభ రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక కావడం చాలా సంతోషమని చెప్పడం జరిగింది ,
* పి ఓబుల్ రెడ్డి పబ్లిక్ స్కూల్ విద్యార్థులు చూపిన ప్రతిభ పాటవాల లో ఇదొక అరుదైన అద్భుతమైన ఆవిష్కరణ , ఎనిమిదవ తరగతి విద్యార్థులైన నమన్ పట్నాయక్ , సోహమ్ బిలో లిక్కర్ , దేబానష మిశ్రా మరియు సాని గంగసాని సాన్వి శ్రీ ఉపాధ్యాయురాలైన షర్మిలా పర్యవేక్షణలో చేపట్టిన సెలైన్ ఫ్లూయిడ్ ఇండికేటర్ అనే ప్రాజెక్ట్ వలన ఎంతో మందికి సెలైన్ ఎక్కించడంతో ఎదురయ్యే సమస్యలను అధిగమించ వచ్చు , . * సెంట్ ఆన్స్ పాఠశాల సికింద్రాబాద్ శాఖవారు 16 మార్చి 2022 నాడు నిర్వహించిన ఒక బూట్ క్యాంపులో స్కూల్ ఇన్నోవేషన్ ఛాలెంజ్ వారు బి ఓబుల్ రెడ్డి పబ్లిక్ స్కూల్ విద్యార్థులకు ఎంపిక రాష్ట్రస్థాయికి ఎంపిక చేయడం జరిగింది .