`మహిళలందరికీ జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు
`నేడు సరోజిని నాయుడు జయంతి
ప్రముఖ స్వతంత్ర సమరయోధురాలు, భారతదేశ తొలి మహిళా గవర్నర్ సరోజినినాయుడు ఫిబ్రవరి 13, 1879న హైదరాబాద్ లో జన్మించారు. ఈ సంవత్సరం సరోజినినాయుడు 146వ జయంతి.
హైదరాబాద్ లోని బెంగాలీ బ్రాహ్మణ కుంటుంబంలో ఫిబ్రవరి 13, 1897న ఆమె జన్మించారు. తల్లిదండ్రులు అఘోరనాథ చటోపాధ్యాయ, వరద సుందరీ దేవి. శాస్త్రవేత్త,తత్వవేత్త అయిన అఘోరనాథ చటోపాధ్యాయ హైదరాబాద్‌లో నిజాం కాలేజీ ని స్థాపించి, ప్రిన్స్‌పాల్‌గా చాలా కాలం పనిచేశారు. తల్లి వరద సుందరీ దేవి కవియిత్రి.
స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొన్న మహిళల కీర్తిప్రతిష్టలను ఇనుమడిరపచేసిన వారిలో సరోజినీనాయుడు ప్రముఖు రాలు. కవిత్వంతో మాధుర్యన్ని కురిపించి నైటింగేల్ ఆఫ్ ఇండియా (భారత కోకిల) గా ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచారు.
ఆమె భారత జాతీయవాద ఉద్యమంలో భాగమైంది. మహాత్మా గాంధీ ఆయన స్వరాజ్య భావనకు అనుచరురాలిగా మారింది. 1930 ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్నందుకు గాంధీ, జవహర్‌లాల్ నెహ్రూ మరియు మదన్ మోహన్ మాలవ్య వంటి ఇతర కాంగ్రెస్ నాయకులతో పాటు ఆమెను అరెస్టు చేశారు. శాసనోల్లంఘన ఉద్యమం మరియు క్విట్ ఇండియా ఉద్యమానికి నాయకత్వం వహించిన ప్రధాన వ్యక్తులలో సరోజిని ఒకరు. ఆ సమయంలో బ్రిటిష్ అధికారులచే ఆమె పదే పదే అరెస్టులను ఎదుర్కొంది మరియు 21 నెలలకు పైగా (1 సంవత్సరం 9 నెలలు) జైలులో గడిపింది. ఆమె 1925లో భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా నియమితులయ్యారు మరియు తరువాత 1947లో యునైటెడ్ ప్రావిన్సెస్ గవర్నర్ అయ్యారు, భారతదేశంలో గవర్నర్ పదవిని నిర్వహించిన మొదటి మహిళగా నిలిచారు.
ఆమె అనిబెసెంట్ తర్వాత జాతీయ కాంగ్రెస్ పార్టీకి రెండవ మహిళా అధ్యక్షురాలిగా 1925లో ఎన్నికయ్యారు. ఆమె 1928లో దేశంలో ప్లేగ్ వ్యాధి ప్రబలిన కాలంలో చేసిన పనులకు గుర్తింపుగా బ్రిటిష్ ప్రభుత్వం ఖైసేర్ ఏ హింద్ బిరుదును అందించింది.
ఆమె 1947 నుండి 1949 వరకు ఆగ్రా మరియు ఔద్ సమైక్య ప్రావిన్సుకు తొలి గవర్నరుగా నియమించబడి, దేశంలో తొలి మహిళాగవర్నర్ గా చరిత్రకెక్కారు.
తనే దేశం, దేశమే తనుగా భావించి దేశ సేవ చేసిన అభేద భావాల మూర్తి రాజకీయ, సాంఘిక, సాంస్కృతిక, సాహిత్య రంగాలలో రకరకాలుగా సేవలు చేసి మానవ సేవ చేయదలుచుకున్న వారికి మార్గాలనేకం అని నిరూపించిన మహితాన్వితురాలు. జీవితమంతా మానవ సేవకు, దేశసేవకూ అంకితము చేసి తన డబ్బై వ యేట 1949 మార్చి 2 వ తేదీన లక్నోలో ప్రశాంతంగా కన్ను మూసింది.సరోజిని నాయుడు కొన్నిరచనలు:
గోల్డెన్ త్రెషోల్డ్ అనే మొదటి కావ్య సంకలనాన్ని ఆమె 1905లో ప్రచురించారు.
ది బర్డ్ ఆఫ్ టైం: సాంగ్స్ ఆఫ్ లైఫ్ డెత్ అండ్ ది స్ప్రింగ్,?ది ఇండియన్ వీవర్స్,?ది బాంగిల్ సెల్లెర్స్..అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం మార్చి 8న ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు.