స్వాతంత్ర సమరయోధులు, ఉమ్మడి Andrapradesh మాజీ మంత్రి కేవి కేశవులు !


`నేడు ఆయన వర్ధంతి 

తెలంగాణ రాష్ట్రానికి చెందిన స్వతంత్ర సమరయోధులు కర్నె వెంకట కేశవులు. ఈయన రాజకీయ నాయకుడిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో జౌలి శాఖ సహకార మంత్రిగా పని చేశాడు. కె.వి.కేశవులు 1924 జనవరి 14న తెలంగాణ రాష్ట్రం  జగిత్యాల జిల్లా ధర్మపురిలో జన్మించాడు. ఆయన విద్యామస్యమంతా ధర్మపురిలో పూర్తి చేశాడు.

కె.వి.కేశవులు భారత స్వతంత్ర ఉద్యమంలో కీలకంగా పని చేస్తూ ఆంద్రప్రదేశ్‌ స్వాతంత్ర సమరయోధుల సంఘం వ్యవస్థాపక కార్యదర్శిగా పని చేశాడు. భారత దేశానికి స్వాతంత్య్రం వచ్చాక హైదరాబాద్‌ (నైజాం) సంస్థానం భారతదేశంలో కలవలేదు. ఆయన నిజాం నిరంకుశపాలన గురించి ప్రజలను చైతన్య వంతులను చేయడం, వారి అరాచకాలను మొండిగా ఎదిరించి జాతీయ పతాకాన్ని రెప రెప లాడిరచి, నాటకాలు, సాహిత్యాలతో ప్రజలను కార్మోకులను చేయడంలో కీలక పాత్ర పోషించాడు. హైదరాబాద్‌ రాష్ట్రం భారతదేశం ప్రభుత్వ పాలనలో విలీనమైన తరువాత ఆయన కాంగ్రెస్‌ పార్టీలో చేరాడు.

కె.వి.కేశవులు 1972, 1978లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సిర్పూర్‌ నియోజకవర్గం నుండి పోటీ చేసి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి జౌళి శాఖ సహకార మంత్రిగా పని చేశాడు.

30 జనవరి 2019లో వృద్ధాప్య కారణాలతో హైదరాబాద్‌ లో మృతి చెందారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....