హర్రర్‌ సస్పెన్స్‌ థ్రిల్లర్‌ జోనర్లో వస్తున్న Movie ” నిన్ను వదలను”

లియుబా పామ్‌, కుష్బూ జైన్‌ ముఖ్య పాత్రల్లో యు వీ టి హాలీవుడ్‌ స్టూడియో (యూఎస్‌ఏ) మరియు శ్రేయ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌ సంయుక్తంగా అశోక్‌ కుల్లర్‌ నిర్మాతగా దేవేంద్ర నెగి సహ నిర్మాతగా షిరాజ్‌ మెహది దర్శకత్వంలో వస్తున్న సినిమా నిన్ను వదలను. గంగాధర్‌, వైజాగ్‌ షరీఫ్‌, వైజాగ్‌ రవితేజ, అజయ్‌, అనంత్‌ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. గోవా హైదరాబాద్‌ ప్రాంతాల్లో జరిగే ఈ సినిమా హర్రర్‌ మరియు సస్పెన్స్‌ థ్రిల్లర్‌ గా ఉండబోతుంది. లియుబా పామ్‌ రష్యాలో పుట్టి పెరిగారు. ఆమె ఒక సింగర్‌ మరియు ప్రొడ్యూసర్‌ కూడా. రష్యాలో సేవ్‌ ద చిల్డ్రన్‌ అని ఒక డాక్యుమెంటరీ ఫిలిం కి నిర్మాతగా మరియు లవ్‌ ఓవర్‌ ఈవిల్‌ అనే టీవీ సిరీస్‌ కి రైటర్‌ మరియు నిర్మాత గా వ్యవహరించారు. ఇప్పుడు స్ట్రైట్‌ తెలుగులో నిన్ను వదలను అనే హర్రర్‌ సస్పెన్స్‌ థ్రిల్లర్‌ సినిమాతో మన ముందుకు వస్తున్నారు.

నటీనటులు :

లియుబా పామ్‌, కుష్బూ జైన్‌, గంగాధర్‌, వైజాగ్‌ షరీఫ్‌, వైజాగ్‌ రవితేజ, అజయ్‌, అనంత్‌

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....