హీరో నవదీప్‌ ఇంట్లో నార్కోటిక్‌ బ్యూరో సోదాలు

హైదరాబాద్‌ సెప్టెంబర్ 19 (ఇయ్యాల తెలంగాణ ): సినీ హీరో నవదీప్‌ ఇంట్లో సోమవారం నాడు పార్కోటిక్స్‌ బ్యూరో పోలీసులు పోదాలు జరిపారు. మాదాపూర్‌ డ్రగ్స్‌ కేసులో నిందితుడిగా హీరో నవదీప్‌ వున్న విషయం తెలిసిందే. పోలీసులు సోదాలు చేసే సమయంలో నవదీప్‌ ఇంట్లో లేరు.  తనను అరెస్టు చేయవద్దు ఇప్పటికే కోర్టు నుంచి  అయన ఆదేశాలు తెచ్చుకున్నాడు. సోమవారం  వరకు నవదీప్‌ ను అరెస్టు చేయొద్దు అంటూ హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. డ్రగ్స్‌ కేస్‌ లో నవదీప్‌ మరోసారి హై కోర్ట్‌ లో పిటిషన్‌ వేయనున్నట్లు సమాచారం. మరోవైపు నవదీప్‌  పై పోలీసులు  కౌంటర్‌ దాఖలు చేయనున్నారు. మాదాపూర్‌ డ్రగ్స్‌ కేస్‌ లో 37 నిందితుడిగా నవ దీప్‌ ను చూపెట్టారు. తన మిత్రుడు రామ్‌ చందు దగ్గర నుంచి డ్రగ్స్‌ తీసుకున్నట్లుగా పోలీసుల వద్ద ఆధారాలు వున్నాయి. ఇప్పటికే నవదీప్‌ స్నేహితుడు రామచంద్‌ ని పోలీసులు అరెస్ట్‌ చేసారు. 

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....