హైదరాబాద్ ,జనవరి 24 (ఇయ్యాల తెలంగాణ ): లక్డికాపుల్ ని కలెక్టరెట్ కార్యాలయంలో హైదరాబాద్ జిల్లా అభివృద్ధి పై సవిూక్షా సమావేశం జరిగింది.. సవిూక్షా సమావేశంలో ముఖ్య అతిధిగా హైదరాబాద్ జిల్లా ఇంచార్జ్ , రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ అనుదిప్ దురశెట్టి, అధ్యక్షతన జరిగిన సమావేశానికి ఆడిషనల్ కలెక్టర్ ముధుసుదన్, ఇతర జిల్లా ఉన్నతాధికారులు పాల్గొన్నారు.హైదరాబాద్ జిల్లా అభివృద్ధి ,ప్రజా సమస్యల పై ,పెండిరగ్ లో ఉన్న పనులపై వివిధ శాఖల వారిగా అధికారులను మంత్రి అడిగి తెలుసుకున్నారు.. రాబోయే పదవ తరగతి పరీక్షల పై జిల్లా అధికారులు అప్రమత్తంగా ఉండాలని, డిపార్మెంట్ ఏదైనా అధికారులు పాఠశాలల్లో పర్యవేక్షించాలని ఆదేశించారు.. గురుకులాలు ,బీసీ వెల్ఫెర్ హాస్టల్ లలో సమస్యలు లేకుండా చూసుకోవాలని సూచించారు.. అభివృద్ధి నిరంతర ప్రక్రియ అని నగరంలో ఏ సమస్య ఉన్నా తన దృష్టికి తీసుకురావలని ప్రభుత్వం తో మాట్లాడతానని హావిూ ఇచ్చారు..
- Homepage
- Telangana News
- హైదరాబాద్ నగర అభివృద్దిపై మంత్రి పొన్నం సవిూక్ష
హైదరాబాద్ నగర అభివృద్దిపై మంత్రి పొన్నం సవిూక్ష
Leave a Comment