100 Million Views తో ‘ఖుషి’ ఫస్ట్‌ సింగిల్‌ ‘నా రోజా నువ్వే’

వంద మిలియన్ల వ్యూస్‌తో దూసుకుపోతోన్న విజయ్‌ దేవరకొండ, సమంత

‘ఖుషి’ ఫస్ట్‌ సింగిల్‌ ‘నా రోజా నువ్వే’

డాషింగ్‌ హీరో ది విజయ్‌ దేవరకొండ, సమంత కలిసి నటిస్తున్న పాన్‌ ఇండియన్‌ చిత్రం ఖుషి. శివ నిర్వాణ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. మైత్రీ మూవీస్‌ నిర్మిస్తోన్న ఈ సినిమా సెప్టెంబర్‌ 1న విడుదల కాబోతోంది. ఈ మధ్యే ఈ మూవీ షూటింగ్‌ పూర్తయింది. పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలను ప్రారంభించింది చిత్రయూనిట్‌.ఖుషి సినిమా మ్యూజికల్‌ ప్రమోషన్స్‌ ప్రస్తుతం స్వింగులో ఉన్నాయి. ఈ చిత్రం నుంచి ఇప్పటికే నా రోజా నువ్వే, ఆరాధ్య వంటి పాటలు వచ్చాయి. యూట్యూబ్‌లో ఇప్పటికీ ట్రెండ్‌ అవుతూ చార్ట్‌ బస్టర్‌లుగా నిలిచాయి. 

ఇక తాజాగా ఈ చిత్రంలోని మొదటి పాట అయిన నా రోజా నువ్వే వంద మిలియన్ల వ్యూస్‌ను క్రాస్‌ చేసింది.వంద మిలియన్ల వ్యూస్‌ను కొల్లగొట్టిన నా రోజా నువ్వే పాట ఇప్పుడు మరోసారి నెట్టింట్లో ట్రెండ్‌ అవుతోంది. గత పదకొండు వారాలుగా ఈ పాట ఎక్కడో చోట ట్రెండ్‌ అవుతూనే వస్తోంది. ఇక ఈ మూవీ నుంచి జూలై 28న మరో పాట విడుదల కానుంది. ఖుషి టైటిల్‌ సాంగ్‌ను రేపు విడుదల చేయబోతోన్న సంగతి తెలిసిందే.మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మిస్తోన్న ఈ చిత్రాన్ని సెప్టెంబర్‌ 1న తెలుగుతో పాటు తమిళ్‌, మళయాల, కన్నడ, హిందీ భాషల్లో విడుదల చేయబోతోన్నారు.

నటీనటులు:

విజయ్‌ దేవరకొండ, సమంత, జయరాం, సచిన్‌ ఖేడేకర్‌, మురళీ శర్మ, లక్ష్మీ, అలీ, శరణ్య పొన్‌ వణ్నన్‌, రోహిణి, వెన్నెల కిషోర్‌, రాహుల్‌ రామకృష్ణ, శ్రీకాంత్‌ అయ్యంగార్‌, శరణ్య ప్రదీప్‌ తదితరులు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....