హైదరాబాద్, అక్టోబరు 11, (ఇయ్యాల తెలంగాణ ); తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే బీజేపీ అభ్యర్ధుల తొలి జాబితా సిద్దమైంది..పార్టీ పెద్దల అప్రూవల్ కోసం అది ఢల్లీి చేరింది..ఈ నెల 14 తర్వాత 39 మందితో ఫస్ట్ లిస్ట్ రిలీజ్ చేసే అవకాశం ఉందంటున్నారు ..ఆ జాబితాలో ఒకరిద్దరు మినహా ముఖ్యనేతలందరికీ టికెట్లు కన్ ఫర్మ అయిందంటున్నారు..సరే మిగిలిన సెగ్మెంట్ల సంగతేంటి? కాషాయపార్టీకి తెలంగాణలో అభ్యర్థులు కరువవుతున్నారా?తెలంగాణ శాసనసభ బరిలో దిగే బీజేపీ అభ్యర్థుల తొలి జాబితా సిద్ధమైంది.. సంబంధిత ప్రాథమిక జాబితా ఢల్లీిలోని జాతీయ నాయకత్వానికి చేరింది.. అలాగని 119 సెగ్మెంట్లకు కేండెట్లను ప్రకటించే స్థితిలో లేదు కాషాయపార్టీ.ఈ నెల 14 తర్వాత సుమారు 39 మందితో జాబితాను ప్రకటిస్తోందంట..ఇందులో ఒకరిద్దరు మినహా రాష్ట్ర ముఖ్య నేతలందరి పేర్లు ఉన్నట్లు సమాచారం.ఎన్నికల షెడ్యూలు విడుదలైన నేపథ్యంలో సభలు, సమావేశాలను కొనసాగిస్తూనే అభ్యర్థుల ఎంపికపైనా బీజపీ దృష్టి సారించింది ఇదే అంశంపై ఇటీవల రెండు రోజులపాటు జరిగిన విస్తృతస్థాయి సమావేశాల్లోనూ చర్చించారు.మొత్తంగా ఆరు వేల మంది దరఖాస్తు చేసుకోగా.పరిశీలన పూర్తయినట్లు తెలిసింది. మూడోవంతు స్థానాలకు ఒకే పేరుతో, మిగిలిన స్థానాలకు ఇద్దరు, ముగ్గురు పేర్లతో జాబితాలను రూపొందించినట్లు సమాచారం.
వాయిస్;తొలి జాబితా అభ్యర్థుల ఎంపిక విషయంలో..గత ఎన్నికల్లో పోటీ చేసి, నియోజకవర్గంతో సుదీర్ఘకాలంగా అనుబంధం కొనసాగిస్తున్న వారికి ప్రాధాన్యం ఇచ్చారు.. సర్వేల నివేదికలనూ పరిశీలించారు. ఆర్థికంగా, సామాజికంగా బలమైన..పార్టీ శ్రేణులకు ఆమోదయోగ్యమైన వారివైపు మొగ్గు చూపారు..రాష్ట్ర నేతల అభిప్రాయాలనూ పరిగణనలోకి రాష్ట్ర ముఖ్యనేతలంతా బరిలో ఉండాలని జాతీయ నాయకత్వం స్పష్టంచేసిన నేపథ్యంలో వారంతా పోటీకి సిద్ధమయ్యారు. ఈ సారి ఎంపీ కేండెట్లు కూడా శాసనసభ బరిలో దిగే అవకాశముందందుఅయితే కొందరు ముఖ్యులు మాత్రం పోటీకి సుముఖంగా లేనట్లు తెలిసింది వారికి సంబంధించిన నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఎంపికలో ముఖ్యనేతల అభిప్రాయాలను తీసుకుంటున్నట్లు సమాచారం. మొదటి జాబితా ప్రకటించిన తర్వాత స్వల్ప వ్యవధిలోనే రెండో జాబితా వెల్లడి ఉంటుందని పార్టీ వర్గాలు తెలిపాయి. ఇతర పార్టీల్లోని అసంతృప్తి నేతలతోనూ అభ్యర్థిత్వాల కోణంలో చర్చిస్తున్నట్లు తెలిసింది.
హైదరాబాద్‌లో మేధావులతో సమావేశం; పార్టీ అగ్రనేత, కేంద్ర మంత్రి అమిత్‌షా రాష్ట్రాన్ని వచ్చి తొలుత రెండు బహిరంగ సభలు నిర్వహించాలని భావించారు ..అయితే..ఆదిలాబాద్ సభను మాత్రమే ఖరారు చేశారు. అదేరోజు అమిత్‌షా హైదరాబాద్‌లో వివిధ వర్గాల ముఖ్యులు, మేధావులతో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. ఎన్నికల షెడ్యూలు తర్వాత కీలకమైన సమయంలో ప్రధాని మోడీ పర్యటనలు ఉండేలా రాష్ట్ర పార్టీ ప్రణాళికలు రూపొందిస్తోంది. అంతలోపు పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ జాతీయ నాయకులు జిల్లాల్లో పర్యటించనున్నారు.