15th August కు రెడీ అవుతున్న Golconda కోట

హైదరాబాద్‌, ఆగస్టు 12 (ఇయ్యాల తెలంగాణ) : స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా గోల్కొండ కోట ముస్తాబవుతుంది ఇప్పటికే గోల్కొండలో జరుగుతున్న ఏర్పాట్లు పరిశీలించారు రాష్ట్ర డిజిపి అంజనీ కుమార్‌. ఉన్నత అధికారులతో సవిూక్ష నిర్వహించిన డిజిపి ..గోల్కొండ కోటలో జరుగుతున్న రిహార్‌ సేల్స్‌ ను పరిశీలించారు.ఆగస్టు 15న సికింద్రాబాద్లోని అమరవీరుల స్థూపానికి నివాళులర్పించిన అనంతరం ఉదయం 11 గంటలకు సీఎం కేసీఆర్‌ గోల్కొండ కోటకు చేరుకుంటారు. అనంతరం గోల్కొండ లోని రాణి మహల్‌ లో జాతీయ జెండాను ఆవిష్కరిస్తారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా స్వాతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర డిజిపి అంజనీ కుమార్‌ అధికారులను సూచించారు.ఆగస్టు 15న సికింద్రాబాద్లోని అమరవీరుల స్థూపానికి నివాళులర్పించిన అనంతరం ఉదయం 11 గంటలకు సీఎం కేసీఆర్‌ గోల్కొండ కోటకు చేరుకుంటారు. అనంతరం గోల్కొండ లోని రాణి మహల్‌ లో జాతీయ జెండాను ఆవిష్కరిస్తారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా స్వాతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర డిజిపి అంజనీ కుమార్‌ అధికారులను సూచించారు.

స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా గోల్కొండ కోటలో రిహార్సల్ట్స్‌ చేస్తున్నారు పోలీసులు. సీఎం కేసీఆర్‌ వచ్చిన అనంతరం గోల్కొండ పైన ఉండే రాణి మహల్‌ కు చేరుకుంటారు… రాణి మహల్‌ వద్ద ఉండే నాలుగు టీమ్లతో కూడిన కంటింజర్స్‌ నుండి కెసిఆర్‌ గౌరవ వందనం స్వీకరించిన అనంతరం గోల్కొండ కోటపై జాతీయ జెండాను ఆవిష్కరిస్తారు.అనంతరం ఆయా ఆయా రంగంలో ప్రతిభ కనబరిచిన వారిని మెడల్స్‌ తో సత్కరించి సభను ఉద్దేశించి ప్రసంగించనున్నారు సీఎం కేసీఆర్‌ ..ఇందుకోసం సభా ప్రాంగణంలో వచ్చేటటువంటి ముఖ్య అతిథులు సందర్శకులు, విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు పడకుండా ఉండేందుకు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు అధికారులు.అలాగే ఆయా శాఖల సమన్వయంతో వచ్చేవారికి మంచినీళ్ల ప్యాకెట్లు, అత్యవసర సమయాల్లో అంబులెన్స్లు, ఫైర్‌ ఇంజన్లను ఏర్పాటు చేశారు. ఈ వేడుకల్లో 500 మందికి పైగా పోలీసులు బందోబస్తులో ఉండునున్నారు. అడుగడుగునా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి కమాండ్‌ అండ్‌ కంట్రోల్స్‌ సెంటర్‌ కు అనుసంధానం చేయనున్నారు. 

వర్షం పడిన వాటర్‌ ప్రూఫ్‌ షెడ్‌ లను ఏర్పాటు చేసి వచ్చే పబ్లిక్కు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకున్నామన్నారు డీజీపీ.. సీఎం కేసీఆర్‌ కు 1500 పైగా మంది కళాకారులు స్వాగతం పలకనున్నారు.స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా గోల్కొండ కోటకు భారీగా విద్యార్థులు సందర్శకులు ముఖ్యఅతిథితులు వచ్చే అవకాశం ఉన్నందున ట్రాఫిక్కు అంతరాయం కలగకుండా పార్కింగ్‌ ప్లేస్‌ లను కేటాయించారు.. ఎమ్మెల్యేలు, ఎంపీలు, సందర్శకులు, ప్రభుత్వ ఉన్నదధికారులు ఇలా వేరువేరుగా వారికి పార్కింగ్‌ ప్లేస్‌ లను కేటాయించారు అధికారులు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....