15th August కు సిక్కోలు చేనేత కార్మికులు

విజయవాడ, ఆగస్టు 12, (ఇయ్యాల తెలంగాణ ): స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తౌెన సందర్భంగా ఆగస్టు 15 వేడుకల్లో సామాన్యులను భాగస్వాములను చేయాలని కేంద్రం భావించింది. అందుకే దేశవ్యాప్తంగా సర్పంచ్‌లు, ఉపాధ్యాయులు, నర్సులు, రైతులు, చేనేత కార్మికులు, మత్స్యాకారులు, భవన నిర్మాణ కార్మికులను ఆహ్వానిస్తోంది. ఇలా వివిధ వర్గాలకు చెందిన వ్యక్తులను దేశవ్యాప్తంగా ఎంపిక చేసి వారికి ఆహ్వానాలు పంపింది. వీరితోపాటు పీఎం కిసాన్‌ లబ్ధిదారులు 1800 మందిని స్వాతంత్య్ర వేడుకలకు ఆహ్వానించింది. వైబ్రెంట్‌ విలేజెస్‌లో భాగంగా ఆయా గ్రామాల రైతులు, మత్స్యకారులు, నేతన్నలు, సర్పంచ్‌లు, టీచర్స్‌, నర్సులను పిలిచారు. పార్లమెంట్‌ భవనం సెంట్రల్‌ విస్తా నిర్మించిన కార్మికులు, సరిహద్దు రహదారుల నిర్మాణ సంస్థ, అమృత్‌ సరోవర్‌ ప్రాజెక్టులు, హర్‌ఘర్‌ జల్‌ యోజన ప్రాజెక్టులకు సేవలు అందించిన సిబ్బందిని ఫ్యామిలీతో కలిసి రావాలని సూచించారు. 

అలాంటి అవకాశాన్ని శ్రీకాకుళం జిల్లా పొందూరుకు చెందిన కార్మికులు దక్కించుకున్నారు. ఎప్పటి నుంచో నేత పనే వృత్తిగా భావిస్తున్న ఇద్దరు వ్యక్తులను ప్రధాని కార్యాలయం నుంచి ఆహ్వానం అందింది. స్వాతంత్య్ర వేడుకల్లో పాల్గొనేందుకు రావాలని సమాచారం అందించారు. వాళ్లు  ఢల్లీి బయల్దేరి వెళ్లనున్నారు. పొందూరకు చెందిన 50 ఏళ్ల బల్ల భద్రయ్యకు, జల్లేపల్లి సూర్యకాంతానికి ఆహ్వానం అందింది. 35 ఏళ్ల నుంచి నేత పని చేస్తున్న భద్రయ్య 100 కౌంటర్‌ బంగారు అంచు కలిగిన పంచెలు నేయడంలో దిట్ట. సూర్యాకాంతం దారం తీయడంలో మంచి పనిమంతురాలు. భద్రయ్య తన భార్య లక్ష్మి, సూర్యకాంతం ముగ్గురు కలిసి ఢల్లీి వెళ్లనున్నారు. వీళ్ల ముగ్గురు ఎర్రకోటలో జరిగే వేడుకకు ప్రత్యేక అతిథులుగా హాజరుకానున్నారు. మాజీ ప్రధానులు, ఇతర దేశాల ప్రతినిధులు కూర్చునే ఏరీయాలోనే వీళ్లకు సీట్లు ఇచ్చారు. స్వాతంత్య్రపోరాటంలో ఖాదీది కీలక పాత్ర అని చెప్పిన కేంద్రం దేశవ్యాప్తంగా 75 మంది కార్మికులు ఈ వేడుకలకు ఆహ్వానిస్తోంది. 

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....