సనత్ నగర్, ఆగష్టు 15 (ఇయ్యాల తెలంగాణ) : పంద్రాగస్టు వేడుకలను పురస్కరించుకొని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు MP – రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె లక్ష్మణ్ బల్కంపేట ఎల్లమ్మ తల్లిని దర్శించుకున్నారు. దేశ ఔన్నత్యాన్ని ప్రపంచ దేశాలకు చాటి చెబుతున్న భారత ప్రధాని నరేంద్ర మోడీ భారత కీర్తి ప్రతిష్టలను ప్రపంచంలో అత్యంత ముందుకు తీసుకువెళ్తున్నారని గుర్తుచేశారు. దేశంలో ప్రతి ఇంటిలో తిరంగా పిలుపుతో దేశ భక్తి పెంపొందించి ప్రతి హృదయంలో మరింత జాగృతను మేలు కొలిపారని అన్నారు. ఆలయ దర్శనంలో డాక్టర్ లక్ష్మణ్ గారికి ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా వెన్నంటే ఉండి ఎల్లమ్మ తల్లి దర్శనమ్ కోసం ఉన్నారు బీజేపీ నాయకులు ఈ కార్యక్రమంలో భాజపా సనత్‌నగర్ కన్వీనర్ శ్రీశైలం గౌడ్, అనిల్‌గౌడ్, చందు ముధిరాజ్, పొలిమేర సంతోష్ కుమార్ తెలంగాణ రాష్ట్ర బీజేపీ నాయకుడు తదితరులు పాల్గొన్నారు.
- Homepage
- Sanath Nagar News
- 15th August సందర్భంగా బల్కంపేట్ ఎల్లమ్మ తల్లిని దర్శించుకున్న Dr. లక్ష్మణ్
15th August సందర్భంగా బల్కంపేట్ ఎల్లమ్మ తల్లిని దర్శించుకున్న Dr. లక్ష్మణ్
Leave a Comment
Related Post