2 నెలలు.. 6 చిరుతలు..

తిరుమల, సెప్టెంబర్‌ 20, (ఇయ్యాల తెలంగాణ );శ్రీవారి భక్తులకు చిరుతల భయం వెంటాడుతోంది..ఓ చిరుత చిక్కిందని ఊపిరి తీసుకునేలోపే.. మరో చిరుత సంచారం టెన్షన్‌ పెడుతోంది. ఇప్పటికే ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా ఐదు చిరుతలను బంధించారు. అంతలోనే ఇప్పుడు మరో చిరుత బోనుకు చిక్కింది.. తాజాగా తిరుమల అలిపిరి కాలిబాట మార్గంలో బోనులో చిరుత చిక్కినట్లు అటవీ శాఖ అధికారులు తెలిపారు. దీంతో ఇప్పటివరకు ఆరు చిరుతలను బంధించినట్లైంది. లక్ష్మీనర్సింహస్వామి ఆలయం.. 2850వ మెట్టు దగ్గర బోనులో చిక్కింది ఈ చిరుత. లక్షితపై దాడిచేసిన చోటే చిక్కింది ఈ చిరుత పులి.  రెండున్నర నెలల్లో ఆరు చిరుతలను పట్టుకున్నారు అధికారులు. అయితే లక్షితపై దాడిచేసిన జంతువును ఇంకా గుర్తించలేదన్నారు డీఎఫ్‌వో శ్రీనివాసులు.. జంతువులను మేం నియంత్రించం కానీ, భక్తులకు రక్షణ కల్పిస్తామన్నారు డీఎఫ్‌వో.గోవిందా గోవిందా అంటూ కొండేక్కే భక్తజనంలో చిరుత భయం మెట్టుమెట్టులోనూ కనిపిస్తోంది. శ్రీవారిని కీర్తిస్తూ కొండెక్కే భక్తులకు రెండు నెలలుగా చిరుత భయం నెలకొంది. పలు ఆంక్షలు అమల్లో ఉన్నా కొండెక్కుతున్న భక్తులు చిరుతల భయంతోనే తిరుమల యాత్ర కొనసాగిస్తున్నారు. వరుస చిరుత దాడులు, సంచారంపై టీటీడీ చేస్తున్న అలెర్ట్‌తో జాగ్రత్తలు పాటిస్తూనే ఉన్నారు. భక్తులు కూడా కొన్ని జాగ్రత్తలు పాటించాలసి ఉంది. వెంట తెచ్చుకున్న తిను బండారాలను కొండల్లో పడేస్తుంటారు. అలా కాకుండా డస్ట్‌ బిన్స్‌లో మాత్రమే వేయాలి. ఈ అవగాహన కల్పించకపోతే భవిష్యత్తులో చిరుతలు, ఎలుగుబంట్లు, ఏనుగులతోనూ ప్రమాదం పొంచి ఉండే అవకాశం ఉంది. వెళ్లాల్సిన దారిలోనే పోవాలని, ఎప్పుడూ పక్కకు వెళ్లడానికి ట్రై చేయడానికి తాము పదే పదే భక్తులకు సూచిస్తామని అటవీ అధికారులు చెబుతున్నారు. టాయిలెట్‌ వెళ్లాలన్నా సరే వాటిని ఏర్పాటు చేసిన దగ్గర మాత్రమే వెళ్లాలని, విడిగా ఎవరూ ఫారెస్ట్‌లోకి వెళ్లకూడదని హెచ్చరిస్తున్నారు.గతంలో తిరుమలకు వెళ్లే యాత్రికులు.. గట్టిగా స్వామివారి నామ స్మరణ చేస్తూ.. అరుపులు, కేకలతో.. తప్పెట్లు`తాళాలు, పాటలు పాడుకుంటూ వెళ్లేవారు. ఇప్పుడు భక్తుల సంఖ్య గణనీయంగా పెరిగినప్పటకీ.. భజన చేసుకుంటూ వెళ్లేవారు కనిపించడం లేదు. కాగా కాలినడకన వెళ్లే ప్రతి భక్తుడికి, భక్తురాలికి ఇప్పటికే ఒక ఊత కర్ర ఇస్తున్నారు. శేషాచలం కొండలను బయో రిజర్వ్‌ ప్రాంతంగా అనౌన్స్‌ చేయడంతో.. జంతువులకు తిరిగే హక్కు ఉంటుందని అధికారులు వెల్లడిరచారు. దీంతో అటు వన్యప్రాణులకు ఇబ్బంది కలగకుండా.. శ్రీవారి భక్తులకు రక్షణ కల్పించేందుకు టీటీడీ తీవ్ర కసరత్తు చేస్తుంది.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....