న్యూ ఢిల్లీ, జూన్ 26 (ఇయ్యాల తెలంగాణ) : జాతీయ రహదారులపై ద్విచక్ర వాహనాలకు కూడా టోల్ ఫీజు వసూలు చేయాలని కేంద్రం నిర్ణయించిదంటూ వచ్చిన వార్తలపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ స్పందించారు.జులై 15 నుంచే అమల్లోకి తీసుకు రానున్నారంటూ జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని స్పష్టంచేశారు. టూవీలర్లకు టోల్ వసూలు చేసే ఉద్దేశమేదీ లేదని పేర్కొన్నారు.కొన్ని విూడియా సంస్థలు ద్విచక్ర వాహనాలపై టోల్ పన్ను విధించడం గురించి తప్పుదారి పట్టించే వార్తలను వ్యాప్తి చేస్తున్నాయని తప్పుబట్టారు.టోల్ పన్నుపై పూర్తి మినహాయింపు కొనసాగుతుందని చెప్పారు.వాస్తవాలు తెలీకుండా తప్పుదారి పట్టించే వార్తలను వ్యాప్తి చేయడం సరికాదని పేర్కొన్నారు.ఎన్‌హెచ్‌ఏఐ కూడా ఇదే తరహా ప్రకటన విడుదల చేసింది.టోల్ ఫీజు ప్రతిపాదనేదీ లేదని స్పష్టంచేసింది.
- Homepage
- National News
- 2 వీలర్లకు టోల్ ఫీజులపై ..క్లారిటీ ఇచ్చిన గడ్కరీ
2 వీలర్లకు టోల్ ఫీజులపై ..క్లారిటీ ఇచ్చిన గడ్కరీ
Leave a Comment