20 రోజులుగా Water Supply లేక – గొంతు ఎండుతోంది మహాప్రభో !

 గొంతు ఎండుతోంది మహాప్రభో!  

బేతంచర్ల, మే 24 (ఇయ్యాల తెలంగాణ) :  బేతంచర్ల పట్టణంలో దాదాపుగా 20 రోజుల నుండి నీళ్లు లేక పట్టణ ప్రజలు గొంతు ఎండుతోంది మహాప్రభో అని అధికారులను వేడుకుంటున్నారు. దాదాపుగా 20 రోజుల నుండి వీది కుళాయిలకు వాటర్‌ వదలడం లేదని పట్టణంలోని దుర్గా పేటకు చెందిన మహిళలు నగర పంచాయతీ వద్ద బైఠాయించి తమ నిరసన వ్యక్తం చేశారు. ఇదే అదునుగా మినరల్‌ వాటర్‌ ప్లాంట్‌ యజమానులు ఒక బిందె నీరు 10 నుండి15 రూపాయలు అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్నారు. ప్రముఖ కంపెనీల పేర్లు చెప్పుకుంటూ వాటి పేర్లను ఆసరాగా చేసుకుని సొమ్ము చేసుకుంటున్నా అధికారులు మాత్రం నిమ్మకు నీరత్తినట్లు వ్యవహరించడం తో ప్రజలంతా హౌరా అంటున్నారు. మినరల్‌ వాటర్‌ యజమానులను ఎందుకు ఇంత రేటు పెంచారు అని కస్టమర్లు అడగగా బోర్లలో నీరు ఎండిపోయాయి అందుకే 15 రూపాయలు చేశామని అంటున్నారని చెబుతున్నారు. 15 రూపాయలు పెంచిన మాత్రాన బోర్లలో నీరు వస్తాయా అని కస్టమర్లు ఎదురు ప్రశ్న వెయ్యగా వాటికి సమాధానం లేదు. ఏది ఏమైనాప్పటికీ అధికారులు స్పందించి ఇటు వంటి మినరల్‌ వాటర్‌ యజమానుల ఆగడాలకు కంచ వేసి ధర తగ్గించి ప్రతి ఒక్కరు నీరు కొనే విధంగా చూడాలని అంటున్నారు. బేతంచర్ల లో నీటిలో క్యాల్షియం శాతం ఎక్కువ ఉండడంతో ఈ నీటిని తాగిన వారికి దుష్ప్రభావాలు ఎక్కువ అని డాక్టర్లు చెబుతుండడంతో మినరల్‌ వాటర్‌ కొనాలని పోతే కొరివిగా మారిందని ఇకనైనా వీటి ధరను అదుపు చేసే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. అదేవిధంగా వీధి కుళాయిలకు నీటిని వదిలి తమ దాహార్తిని తీర్చాలని కోరుతున్నారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....