200 మందికిపైగా ప్రయాణికులతో వెళ్తు సముద్రంలో చిక్కుకుపోయిన SHIP

న్యూ డిల్లీ సెప్టెంబర్‌ 14 (ఇయ్యాల తెలంగాణ ): 200 మందికిపైగా ప్రయాణికులతో వెళ్తున్న ఓ విలాసవంతమైన క్రూయిజ్‌ షిప్‌ సముద్రంలో చిక్కుకుపోయింది. ప్రముఖ వార్తా సంస్థ ఇండిపెండెంట్‌ నివేదిక ప్రకారం.. మూడు వారాల ట్రిప్‌ కోసం ఈ నెల 1న బయలుదేరిన నౌక 22న తిరిగి పోర్టుకు చేరుకోవాల్సి ఉంది. అయితే, గ్రీన్‌ల్యాండ్‌ రాజధాని నుక్‌ కు 850 మైళ్ల దూరంలో సోమవారం మధ్యాహ్నం ఈ నౌక సముద్రంలో చిక్కుకుపోయినట్లు తెలిపింది. ప్రస్తుతం నౌకలోని ప్రయాణికులు, సిబ్బందితో కలిసి 206 మంది ఉన్నారని.. అందరూ క్షేమంగా ఉన్నట్టు వెల్లడిరచింది. రెస్క్యూ షిప్‌ శుక్రవారం వరకు అక్కడకి చేరుకునే పరిస్థితి లేదని పేర్కొంది. మరోవైపు ఈ ట్రిప్‌ కోసం షిప్‌ యాజమాన్యం ఒక్కో ప్రయాణికుడి నుంచి దాదాపు రూ. 27 లక్షలు (33 వేల డాలర్లు) వసూలు చేశారు.ప్రస్తుతం నౌకలోని వారంతా క్షేమంగా ఉన్నట్లు షిప్‌ ఆపరేటర్‌ తెలిపారు. షిప్‌లో ప్రయాణికులకు అవసరమైన అన్ని సౌకర్యాలు ఉన్నాయని వెల్లడిరచారు. అయితే ప్రయాణికుల్లో కొందరికి కరోనా వైరస్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు తెలిపారు. దీంతో కాస్త ఆందోళన వ్యక్తమవుతోందని పేర్కొన్నారు. ప్రస్తుతం పాజిటివ్‌గా తేలిన వారిని ఓ గదిలో ఉంచి వైద్యం అందిస్తున్నట్లు వివరించారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....