2024 జనవరి నెల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల కోటా విడుదల

తిరుమల అక్టోబర్ 18 (ఇయ్యాల తెలంగాణ ):శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులకు సౌకర్యవంతంగా ఉండేలా టీటీడీ షెడ్యూల్‌ ప్రకారం 2024 జనవరి నెల తిరుమల శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శన టికెట్ల కోటాను విడుదల చేస్తోంది.ఇందులో భాగంగా జనవరి నెలకు సంబంధించిన సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళపాదపద్మారాధన ఆర్జిత సేవల ఆన్‌ లైన్‌ లక్కీడిప్‌ కోసం అక్టోబర్‌ 18వ తేదీ ఉదయం 10 గంటల నుండి 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు నమోదు చేసుకోవచ్చు. లక్కీడిప్‌లో టికెట్లు పొందిన భక్తులు అక్టోబర్‌ 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటలలోపు రుసుము చెల్లించి వాటిని ఖరారు చేసుకోవాల్సి ఉంటుంది.కల్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఊంజల్‌ సేవ, సహస్రదీపాలంకార సేవాటికెట్లను అక్టోబర్‌ 21వ తేదీ ఉదయం 10 గంటలకు విడుదల చేస్తారు.వర్చువల్‌ సేవా టికెట్లను అక్టోబర్‌ 21వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేస్తారు.ఆంగప్రదక్షిణం టోకెన్ల కోటాను అక్టోబర్‌ 23వ తేదీ ఉదయం 10 గంటలకు విడుదల చేస్తారు.శ్రీవాణి ట్రస్టు బ్రేక్‌ దర్శనం, గదుల కోటాను అక్టోబర్‌ 23వ తేదీ ఉదయం 11 గంటలకు విడుదల చేస్తారు.వృద్ధులు, దివ్యాంగులకు దర్శన టోకెన్ల కోటాను అక్టోబర్‌ 23వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేస్తారు.ప్రత్యేక ప్రవేశ దర్శనం రూ.300 టికెట్ల కోటాను అక్టోబర్‌ 24వ తేదీ ఉదయం 10 గంటలకు విడుదల చేస్తారు.తిరుమల, తిరుపతిలో వసతి గదుల బుకింగ్‌ అక్టోబర్‌ 25వ తేదీ ఉదయం 10 గంటలకు విడుదల చేస్తారు.డిసెంబరు నెలకు సంబంధించి అక్టోబరు 27న ఉదయం 10 గంటలకు తిరుమల, తిరుపతికి చెందిన శ్రీవారి సేవ కోటాను, ఉదయం 12 గంటలకు నవనీత సేవ కోటాను, మధ్యాహ్నం 3 గంటలకు పరకామణి సేవ కోటాను విడుదల చేస్తారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....