3 Bus యాత్రలకు అంతా సిద్ధం – Final సభకు ప్రధాని Modi

హైదరాబాద్‌, ఆగస్టు 19 (ఇయ్యాల తెలంగాణ) : తెలంగాణలో పాగా వేయాలనే పట్టుదలతో సాగుతోన్న బీజేపీ తన దూకుడు పెంచింది. త్వరలో జరగబోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలోని క్యాడర్‌లో కొత్త ఉత్సాహం నింపుతూ, నిత్యం ప్రజల్లో ఉండేలా ప్లాన్‌ చేస్తోంది. ఈ క్రమంలోనే జాతీయ కార్యవర్గం మొత్తం తెలంగాణపై ఫోకస్‌ చేసేలా పావులు కదుపుతోంది. అందులో భాగంగా తెలంగాణలో బస్సు యాత్రలు చేయాలని నిర్ణయించింది కిషన్‌ రెడ్డి నేతృత్వంలోని బీజేపీ నాయకత్వం. ఈ మేరకు ఆగస్టు నెల ఆఖరులోనే బీజేపీ యాత్రలు ప్రారంభం అయ్యే అవకాశం కనిపిస్తోంది దానికి సంబంధించిన సన్నాహక సమావేశాలు ఇప్పటికే కొనసాగుతున్నాయి, ఇంకా ఎక్కడ నుంచి ప్రారంభించాలి..? ఎలాంటి అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి..? అనే దానిపై కూడా కసరత్తు కొనసాగుతోంది.మరోవైపు ఈ బస్సు యాత్రలు రాష్ట్రంలోని మూడు చోట్ల నుండి ప్రారంభం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. 

భద్రాచలం, బాసర, అలంపూర్‌ల నుంచి ఈ బస్సు యాత్రలు ప్రారంభించాలని ప్రత్తిపాదనలు ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈసారి అభ్యర్థుల ప్రకటన అనుకున్న దాని కంటే ముందే ఉండే అవకాశం ఉండడంతో యాత్రలను కూడా ముందే ముగించాలని అనుకుంటున్న బీజేపీ ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా సమాచారం.ఇక సుమారుగా 18 రోజుల పాటు యాత్ర జరగనుందని, ఒక్కో రూట్‌లో 36 నియోజక వర్గాలు కవర్‌ అయ్యే విధంగా.. ప్రతి రోజు రెండు నియోజక వర్గాల యాత్ర ప్లానింగ్‌ చేస్తుంది రాష్ట్ర నాయకత్వం. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్‌ రెడ్డి, జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్‌, ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్‌ ఈటల రాజేందర్‌ ఈ మూడు రూట్లలో సాగే యాత్రలకు సారథ్యం వహించనున్నారని కూడా తెలుస్తోది. ఇక ఈ యాత్రల్లో బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్య మంత్రులు, బీజేపీ జాతీయ నేతలు, కేంద్ర మంత్రులు పాల్గొనేలా వ్యూహరచన చేస్తోంది కిషన్‌ రెడ్డి నాయకత్వం. ఇంకా సెప్టెంబర్‌ 17న హైదరాబాద్‌లో ముగింపు సభను ఏర్పాటు చేసి, ఆ సభలో భారత ప్రధాని నరేంద్ర మోదీని ఆహ్వానించాలనే యోచనలో ఉంది రాష్ట్ర బీజేపీ నాయకత్వం.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....