30 వేల ఎకరాల్లో Future City ఏడాదిన్నరలో 3 లక్షల పెట్టుబడులు

హైదరాబాద్‌, జూన్ 24 (ఇయ్యాల తెలంగాణ) : భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మించబోతున్న ఫ్యూచర్‌ సిటీలో పెట్టుబడులు పెట్టేలా ఫ్రెంచ్‌ కంపెనీలను ప్రోత్సహించాలని ‘ఇండో ? ఫ్రెంచ్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ ఇండస్ట్రీ(ఇఫ్కీ)’ ప్రతినిధులను మంత్రి శ్రీధర్‌ బాబు కోరారు. డా.బీఆర్‌ అంబేద్కర్‌ సచివాలయంలో మంగళవారం నాడు ఇఫ్కీ ప్రతినిధులతో రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహించారు. తెలంగాణలో పరిశ్రమల ఏర్పాటుకు అనుకూలతలు, ప్రభుత్వం తరఫున అందిస్తున్న ప్రోత్సాహాకాలను మంత్రి శ్రీధర్‌ బాబు వివరించారు. మంత్రి శ్రీధర్‌ బాబు మాట్లాడుతూ.. ‘తెలంగాణ బ్రాండ్‌ ను విశ్వవ్యాప్తం చేయాలనే దూరదృష్టితోనే సీఎం రేవంత్‌ రెడ్డి పీపీపీ విధానంలో ఫ్యూచర్‌ సిటీ అభివృద్ధికి శ్రీకారం చుట్టారు.30వేల ఎకరాల్లో ఫ్యూచర్‌ సిటీ నిర్మాణం జరుగుతోంది. ఇది కేవలం ఒకనగరం కాదు. రాష్ట్ర భవిష్యత్తు. అంతర్జాతీయ భాగస్వామ్యంతో ఫ్యూచర్‌ సిటీని మరింత ముందుకు తీసుకెళ్లాలన్నదే మా సంకల్పం’ అని వివరించారు. ‘ఏడాదిన్నర వ్యవధిలోనే కాంగ్రెస్‌ పాలనలో తెలంగాణకు రూ.3 లక్షల కోట్ల పెట్టబడులు తెచ్చాం. గతేడాది హైదరాబాద్‌ లో 70 జీసీసీలు ప్రారంభమయ్యాయి. పారిశ్రామికవేత్తలకు కాంగ్రెస్‌ ప్రభుత్వంపై ఉన్న నమ్మకానికి ఇది నిదర్శనం. పరిశ్రమలకు అవసరమైన అన్ని రకాల మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి. 

ప్రతిభ గల మానవ వనరులకు మన వద్ద కొరత లేదు. మరింత వేగంగా, పారదర్శకంగా అనుమతులిచ్చేందుకు టీజీ ? ఐపాస్‌ ను ఏఐతో అనుసంధానం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం’ అని చెప్పారు.‘ఏరో స్పేస్‌, ఫార్మా, ఫుడ్‌ ప్రాసెసింగ్‌, ఐటీ లాంటి రంగాల్లో పలు ఫ్రెంచ్‌ కంపెనీలు ఇప్పటికే రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాయి. సనోఫి, మోనిన్‌, డసాల్ట్‌, టెలీ పర్‌ ఫార్మెన్స్‌, సఫ్రాన్‌, క్యాప్‌ జెమినీ, ఓపెల్లా హెల్త్‌ కేర్‌ లాంటి దిగ్గజ సంస్థలు తమ కార్యకలాపాలను రాష్ట్రంలో నిర్వహిస్తున్నాయి. ఎమర్జింగ్‌ టెక్నాలజీస్‌, డిజిటల్‌ గవర్నెన్స్‌, ఆగ్రో ఇన్నోవేషన్‌, క్లీన్‌ ఎనర్జీ, గ్రీన్‌ మొబిలిటీ, స్మార్ట్‌ హెల్త్‌ సిస్టమ్స్‌, ఫ్యూచర్‌ రెడీ ఎడ్యుకేషన్‌, సస్టైనబుల్‌ మ్యానుఫాక్చరింగ్‌ తదితర రంగాల్లో అవకాశాలున్నాయి. దీన్ని ఫ్రాన్స్‌ పారిశ్రామికవేత్తలు సద్వినియోగం చేసుకునేలా చొరవ చూపాలని’ అని ఇఫ్కీ ప్రతినిధులను మంత్రి శ్రీధర్‌ బాబు కోరారు.‘తెలంగాణ ? ఫ్రెంచ్‌’ మధ్య ద్వైపాక్షిక సహకారాన్ని మరింత మెరుగుపర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. కార్యక్రమంలో ఇఫ్కీ నుంచి యోహాన్‌ సామ్యూల్‌, ప్రియాంక్‌ ప్రకాష్‌, నకుల్‌ దల్వాలా, మోనిన్‌, ఓపెల్లా హెల్త్‌ కేర్‌, సనోఫీ ఇండియా, టెలిపర్‌ ఫార్మెన్స్‌, వార్‌ ఎలక్ట్రోకెమ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, సఫ్రాన్‌ ఎయిర్‌ క్రాఫ్ట్‌ ఇంజిన్‌ సర్వీసెస్‌ ఇండియా, జీగ్లర్‌ ఏరోస్పేస్‌ తదితర పలు ఫ్రెంచ్‌ కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు.R

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....