400లకు చేరిన టెట్‌ ఫీజు


హైదరాబాద్‌, ఆగస్టు 4, (ఇయ్యాల తెలంగాణ ); తెలంగాణ టెట్‌ దరఖాస్తు రుసుం భారీగా పెరిగింది. గతంలో 300 రూపాయల ఫీజు ఉండగా? ఈసారి మాత్రం రూ. 400కు పెరిగింది. దీనిపై అభ్యర్థులు పెదవి విరుస్తున్నారు.టెట్‌ నోటిఫికేషన్‌ వచ్చింది… దరఖాస్తులు కూడా ప్రారంభమయ్యాయి. దీనిపై చాలా మంది అభ్యర్థులు హర్షం వ్యక్తం చేస్తున్నప్పటికీ…. అప్లికేషన్‌ ఫీజు భారీగా పెరగటంపై పెదవి విరుస్తున్నారు. రాష్ట్ర ఏర్పాటు తర్వాత నిర్వహిస్తూ వస్తున్న ప్రతిసారి… అంతో ఇంతో పెంచుతూ వస్తోంది విద్యాశాఖ. ఈసారి కూడా ఏకంగా రూ. 100 పెంచింది. దీంతో ఈసారి పరీక్ష రాసే అభ్యర్థులు రూ. 400 చెల్లించాల్సి ఉంది.నిజానికి తెలంగాణ ఏర్పాటు తర్వాత… 2016లో తొలిసారి టెట్‌ ఎగ్జామ్‌ నిర్వహించారు. అప్పుడు ఫీజు కేవలం రూ. 200గా ఉంది. ఆ తర్వాత 2017లోనూ అదే ఫీజును కంటిన్యూ చేశారు. గతేడాది నిర్వహించిన ఎగ్జామ్‌ కు సంబంధించి రూ. 300 పెంచారు. తాజాగా వచ్చిన నోటిఫికేషన్‌ లో రూ. 400 చెల్లించాలని పేర్కొన్నారు. ఫీజు పెంపుపై విద్యార్థులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా డీఈడీ అభ్యర్థులు ఈ విషయాన్ని ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. తాము పేపర్‌ 1 మాత్రమే రాస్తామని… అలాంటప్పుడు తమకు కూడా రూ. 400 ఫీజు పెట్టడమేంటని ప్రశ్నిస్తున్నారు. దీనిపై సర్కార్‌ పునరాలోచన చేయాలని కోరుతున్నారు. ఇదే విషయంపై హిందుస్తాన్‌ టైమ్స్‌ తెలుగుతో డీఈడీ పూర్తి చేసి టెట్‌ ఎగ్జామ్‌ కు ప్రిపేర్‌ అవుతున్న డబ్బికార్‌ శ్రీకాంత్‌ మాట్లాడారు. ఫీజు తగ్గింపు అంశంపై ప్రభుత్వం ఆలోచించాలని కోరారు. చాలా నోటిఫికేషన్లు ఒకేసారి రావటంతో… దరఖాస్తులకే చాలా డబ్బులు కట్టాల్సి వస్తోందని అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా డీఈడీ అభ్యర్థుల విషయంలోనైనా గతేడాది ఫీజునే నిర్ణయించాలని కోరారు.

టెట్‌ షెడ్యూల్‌?  సెప్టెంబర్‌ 15న టెట్‌ పేపర్‌1, పేపర్‌2 పరీక్షలను నిర్వహించనున్నారు. ఆగస్టు 16 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ, ఫీజు చెల్లింపునకు అవకాశం కల్పించారు. తుది ఫలితాలను సెప్టెంబర్‌ 27న విడుదల చేస్తారు. సెప్టెంబర్‌ 15న నిర్వహించే టెట్‌ పేపర్‌ 1 పరీక్షనను ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు, పేపర్‌ `2 ను మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 వరకు నిర్వహిస్తున్నారు. పరీక్ష ఫీజు రూ. 400 చెల్లించి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.

ప్రాసెస్‌ ఇదే… అభ్యర్థులు మొదటగా ష్ట్రబిబిజూబ://బిబబివబి.ఞణణ.ణనీల.తిని/ వెబ్‌ సైట్‌ లోకి వెళ్లాలి.అప్లికేషన్స్‌ లింక్‌ పై క్లిక్‌ చేసి.. విూ వివరాలను ఎంట్రీ చేయాలి.దరఖాస్తు ఫారం పూర్తి చేసే ముందే అప్లికేషన్‌ ఫీజును ఆన్‌ లైన్‌ విధానంలో చెల్లించాలి.పేపర్‌  `1ను డీఐఈడీ, బీఈడీ అభ్యర్థులు రాసుకోవచ్చు. బీఈడీ అర్హత కలిగిన వారు పేపర్‌ `2తోపాటు పేపర్‌ `1కు కూడా హాజరుకావొచ్చు. ఆప్షన్స్‌ ను జాగ్రత్తగా ఎంచుకోవాలి.ఫోటో, సంతకం కూడా అప్‌ లోడ్‌ చేయాల్సి ఉంటుంది. విూ అప్లికేషన్‌ పూర్తి అయిన తర్వాత… దరఖాస్తు ఐడీ నెంబర్‌ జనరేట్‌ అవుతుంది.ఈ నెంబర్‌ తోనే విూరు హాల్‌ టికెట్లను డౌన్లోడ్‌ చేసుకోవాల్సి ఉంటుంది.ఎన్‌సీటీఈ నిబంధనల ప్రకారం డీఎడ్‌, బీఎడ్‌ పాసైన వారు టెట్‌లో ఉత్తీర్ణులైతేనే ఉపాధ్యాయుల నియామకానికి నిర్వహించే టీఆర్‌టీ పరీక్ష రాయడానికి  అర్హులవుతారు. టెట్‌లో వచ్చిన మార్కులకు టీఆర్‌టీ ర్యాంకింగ్‌లో 20 శాతం వెయిటేజీ ఉన్నందున టెట్‌లో అత్యధిక మార్కులు దక్కించుకోవడానికి అభ్యర్థులు పోటీపడుతుంటారు. టెట్‌ లో అర్హత లేకపోతే ఈ పరీక్షలకు హాజరుకాలేరు.పైగా టెట్‌ ఉత్తీర్ణత లేకపోతే ప్రైవేటు పాఠశాలల్లో కూడా బోధన చేయడానికి వీలుండదు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....