భారత ఆధ్యాత్మిక ప్రగతికి నిదర్శనమైన కుంభమేళకు దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి కోట్ల మంది భక్తులు పోటెత్తారు. ప్రయాగ్‌రాజ్‌లోని గంగా, యమునా, సరస్వతి నదుల పవిత్ర త్రివేణి సంగమంలో 45 రోజుల పాటు సాగిన వేడుకలు.. ఆద్యంతం ఆధ్యాత్మికత, భక్తిపారవశ్యంతో నిండిపోయాయి. కనీవిని ఎరుగని రీతిలో నిర్వహించిన ‘మహా కుంభమేళా’ పరిసమాప్తం అయ్యింది. 144 ఏళ్లకోసారి వచ్చే ఈ విశిష్ఠ కుంభమేళా జనవరి 13న ఆరంభమైంది. ప్రపంచంలోనే అతిపెద్ద జన జాతరగా భావిస్తున్న ఈ మహా స్నానఘట్టం మహా శివరాత్రితో ముగిసిపోయింది. చివరి రోజున అమృత స్నానం ఆచరించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో పోటెత్తారు. ఉదయం 5.30 గంటల నుంచే స్నాన ఘాట్టాలు భక్తులతో కిక్కిరిసిపోయారు. చివరి రోజున సుమారు 1.5 కోట్లకు పైగా భక్తులు అమృతస్నానం ఆచరించారని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తెలిపింది. దీంతో, మహా కుంభమేళా స్నానాలు ఆచరించిన మొత్తం భక్తుల సంఖ్య 66 కోట్లు దాటినట్లు ప్రభుత్వం ప్రకటించింది.
భక్తుల సంఖ్యలో అనుకున్న స్థాయికి మించి పెరుగుదల నమోదైనట్లు అధికారులు వెల్లడిరచారు. చైనా, భారత్ మినహా ఇతర అన్ని దేశాల జనాభా కంటే ఎక్కువ సంఖ్యలో భక్తులు స్నానమాచరించారు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు చెందిన భక్తులతో పాటు ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలకు చెందిన వారు కూడా ఈ మహా క్రతువులో పాల్గొన్నారు. ముగింపు సందర్భంగా ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ ‘ఎయిర్‌షో’ నిర్వహించింది. మహా కుంభమేళా క్షేత్ర గగనతలంలో ఈ ప్రత్యేక ఎయిర్‌షో ఆకట్టుకుంది. చివరి రోజున ఎలాంటి అవాంఛనీయమైన ఘటనలు చోటుచేసుకోకుండా అధికారులు అత్యంత కట్టుదిట్టమైన భద్రతా చర్యలు ఏర్పాటు చేశారు. అదనపు బలగాలను మోహరించారు.
మహా కుంభమేళా`2025లో ఎంతో మంది సామాన్య వ్యక్తులు సెలబ్రిటీలుగా మారారు. వారిలో ప్రముఖులైన వారిలో మధ్యప్రదేశ్‌కు చెందిన 16 ఏళ్ల మోనాలీసా మొదటి స్థానంలో ఉంటారు. ఈమె పూసలు విక్రయించే ఆవిడ కాగా.. రాత్రికి రాత్రే సెలబ్రిటీగా మారిపోయింది. సోషల్ విూడియాలో ఆమె వీడియోలు ఇంకా వైరల్ అవుతూనే ఉన్నాయంటే ఆమెకు ఎంత క్రేజ్ వచ్చిందో అర్థం చేసుకోవచ్చు. కుంభమేళా ప్రాంగణంలో జనాలంతా ఆమెతో ఫోటోలు తీసుకునేందుకు పోటీ పడ్డారు. అదృష్టం కొద్దీ మోనాలీసాను సినిమా ఛాన్స్ వరించింది. ఆ తర్వాత.. ‘ఐఐటీ బాబా’ గుర్తింపు తెచ్చుకున్న అభయ్ సింగ్ అనే బాబా కూడా ఫేమస్ అయ్యాడు. ఆయన ఐఐటీ బాంబే ఏరోస్పేస్ ఇంజనీరింగ్ చదివారు. ఆ తర్వాత బాబాగా మారిపోయారు. అందుకే, ఆయనకు ఐఐటీ బాబా అని పిలిచారు.
మహా కుంభమేళాలో అమృత స్నానమైన ‘మౌని అమావాస్య’ సందర్భంగా జనవరి 29న ఘోర విషాదం చోటుచేసుకొంది. ఎముకలు కొరికే చలిని సైతం లెక్కచేయండా రాత్రి సమయంలో భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. రద్దీ నియంత్రణలో వైఫల్యం కారణంగా తొక్కిసలాట జరిగి ఏకంగా 30 మంది భక్తులు ప్రాణాలు కోల్పోయారు. రాత్రి 1.30గంటల సమయంలో ఈ విషాదం చోటుచేసుకుంది. ఈ దుర్ఘటనపై ప్రధాని మోదీ, యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీగ్భ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ తొక్కిసలాట ఘటన తీవ్ర విషాదాన్ని నింపినప్పటికీ ప్రయాగ్‌రాజ్‌కు భక్తుల సంఖ్య ఏమాత్రం తగ్గలేదు. మరోవైపు, మహా కుంభమేళాకు తరలి వెళ్లే భక్తుల రద్దీ కారణంగా ఢల్లీి రైల్వే స్టేషన్లో కూడా తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఏకంగా 18 మంది చనిపోయారు.మహా కుంభమేళాలో మొత్తం మూడు సార్లు అగ్నిప్రమాదాలు సంభవించాయి.
కుంభమేళా`2025లో పేద వర్గాల నుంచి రాజకీయ, సినీ, వ్యాపార, ఇతర రంగాలకు చెందిన ఎంతోమంది ప్రముఖులు పాల్గొన్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కట్టుదిట్టమైన భద్రత నడుమ మహా కుంభమేళా స్నానం ఆచరించారు. క్షణం తీరిక లేకుండా గడిపే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫిబ్రవరి 5న ప్రయాగ్‌రాజ్ వెళ్లి త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం చేశారు. కోట్లాది మంది భక్తుల మాదిరిగానే తాను కూడా దైవాశ్వీరాదం పొందానని మోదీ వ్యాఖ్యానించారు. ప్రపంచ కుభేరుల్లో ఒకరైన రిలయన్స్ అధినేత ముకేష్ అంబానీ, తన కుటుంబ సభ్యులతో కలిసి మహా కుంభమేళాలో స్నానమాచరించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్, పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ పాలి రాష్ట్రాల సీఎంలు, బీజేపీతో పాటు ఇతర రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు పెద్ద సంఖ్యలో మహా కుంభమేళాలో పాల్గొన్నారు.